గురువారం 06 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 06, 2020 , 02:43:12

జిల్లాలో కరోనా ప్రబలకుండా అధికార యంత్రాంగం కృషి అభినందనీయం

జిల్లాలో కరోనా ప్రబలకుండా అధికార  యంత్రాంగం కృషి అభినందనీయం

  • పారిశుధ్య కార్మికులను సన్మానించిన మంత్రి నిరంజన్‌రెడ్డి
  • అధికారులు, కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం
  • వనపర్తి, గోపాల్‌పేట మండలాల్లో కాల్వలను పరిశీలించిన మంత్రి

వనపర్తి : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలకు పాదాభివందనం చేసినా తక్కువేనని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ని తన క్యాంపు కార్యాలయంలో వనపర్తి మున్సిపాలిటీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులను జెడ్పీ చైర్మన్‌ లో కనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా, ఎస్పీ అపూర్వరావులతో కలిసి మంత్రి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కార్మికులతో కలిసి సహపంక్తి భో జనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు. పారిశుధ్య కార్మికులు మనలాంటి మనుషులేనని, వారు చేస్తున్న శ్రమకు పాదాభివందనం చేసినా తక్కువేనన్నారు. విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా అవగాహన కల్పించి.., వారి ద్వారా తల్లిదండ్రులకు వివరించాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపాలిటీ ట్రాక్టర్లలోనే వేయాలని కోరారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు నిర్వహించిన బాధ్యతలు, అందించిన సేవలు వెలకట్టలేనివని, వారి మూలంగానే ఈ రోజు మనం ఆరోగ్యంగా జీవిస్తున్నామన్నారు. జిల్లాలో కరోనా ప్రబలకుండా పోలీసులు, రెవెన్యూ యంత్రాం గం చేసిన కృషి అభినందనీయమన్నారు. పారిశుధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం చాలా ఆనందంగా ఉందని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో శ్రీనివాసులు, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, సత్యంసాగర్‌, నారాయణ, నాగన్నయాదవ్‌, భాష్యానాయక్‌, భువనేశ్వరి, అలేఖ్య, శాంత, చంద్రకళ, నాయకులు తిరుమల్‌ నాయడు, శ్యాం, కృష్ణ య్య, రమేశ్‌, యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ప్రతి గ్రామానికీ సాగు నీరందిస్తాం

వనపర్తి రూరల్‌/గోపాల్‌పేట : నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ సాగునీరందిస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం మండలంలోని దత్తాయిపల్లి గ్రామ శివారులోని డీ-8 కాల్వ, గోపాల్‌పేట మండలంలోని ఏదుట్ల, జయన్నతిరుమలాపూర్‌, ము న్ననూర్‌, అప్పాయిపల్లి, వనపర్తి వరకు 8.7 కిలోమీట ర్ల మేర అసంపూర్తిగా ఉన్న డీ-8, ఎంజే-3ఏ కాలువ పనులను మంత్రి బైక్‌పై తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనివార్య కారణాలతో నిలిచిపోయిన కాల్వ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. డీ-8 ద్వారా గోపాల్‌పేట, వనపర్తి, కొల్లాపూర్‌ నియో జకవర్గానికి సాగునీరందుతుందన్నారు.

సమైక్య పాలనలో ఈ కాలువలను సగం సగం పనులు చేసి వదిలారన్నారు. గతంలో జరిగిన పనులకు బిల్లులు రావని, పెండింగ్‌ పనులు చేయించకుంటే రైతులకు సాగునీరు పారదన్నారు. కావున 25 రోజులుగా సొంత ఖర్చులతో పెండింగ్‌ పనులను చేయిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పది రోజుల్లో పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కిచ్చారెడ్డి, చందాపూర్‌ సర్పంచ్‌ చెన్నారెడ్డి, ఎంపీటీసీ ధర్మానాయక్‌, టీఆర్‌ఎస్‌  ప్రధాన కార్యదర్శి కురుమూర్తి, నాయకులు వెంకట య్య, దేవేందర్‌నాయుడు, రాజునాయక్‌, కృష్ణయ్య, రా మస్వామి, నాగిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ రఘుయాద వ్‌, రైతుబంధు సమితి గోపాల్‌పేట మండల కో ఆర్డినేటర్‌ తిరుపతి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo