ఆదివారం 12 జూలై 2020
Nagarkurnool - Jun 03, 2020 , 04:52:32

ఇంద్రవెల్లి ఎస్‌ఐపై వేటు

ఇంద్రవెల్లి ఎస్‌ఐపై వేటు

హెడ్‌ క్వార్టర్‌కు అటాచ్‌

ఎదులాపురం :  కొంతకాలంగా ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇంద్రవెల్లి ఎస్‌ఐ ఏ గంగారామ్‌పై వేటు పడింది. ఎస్‌ఐ బాధ్యతల నుంచి గంగారామ్‌ను తప్పిస్తూ, శాఖాపరమైన చర్యలకు ఎస్పీ విష్ణువారియర్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గంగారామ్‌ను జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. క్రమశిక్షణ పాటించని, అవకతవకలకు పాల్పడే అధికారులపై శాఖా పరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. ఎస్‌ఐ బాధ్యతలను తాత్కాలికంగా ఏఎస్‌ఐ నిర్వహిస్తారని తెలిపారు. logo