ఆదివారం 12 జూలై 2020
Nagarkurnool - Jun 03, 2020 , 04:51:13

కారణజన్ముడు సీఎం కేసీఆర్‌ : ఎంపీ మన్నె

కారణజన్ముడు సీఎం కేసీఆర్‌ : ఎంపీ మన్నె

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అవతరించిన కారణజన్ముడు సీఎం కేసీఆర్‌ అని మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ప్ర కటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచమే నివ్వెరపోయే లా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు. పాలమూరు-రంగారెడ్డిని త్వరలో పూర్తి చేసి పాలమూరును పసిడి పంటల ఖిల్లాగా మార్చనున్నారన్నారు. ఉద్యోగులందరినీ ఏకతాటికి తీసుకువచ్చి స్వరాష్ట్ర ఉద్యమంలో మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎంతో కృషి చేశారన్నారు. 44వ జా తీయ రహదారిపై ఉన్న 18 బ్లాక్‌ స్పాట్‌లలో అండర్‌పాస్‌ బ్రిడ్జీలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కోరినట్లు పేర్కొన్నారు. నారాయణపేటలో సైనిక్‌ స్కూల్‌, షాద్‌నగర్‌లో మరో కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరు చేయాలని అడిగానన్నారు. 


logo