ఆదివారం 12 జూలై 2020
Nagarkurnool - Jun 03, 2020 , 04:42:40

అభివృద్ధికి కంకణబద్ధులమవుదాం

అభివృద్ధికి కంకణబద్ధులమవుదాం

  •  ప్రతి ఒక్కరూ పూర్తి సహకారం అందించాలి   
  • ‘పాలమూరు’ ప్రాజెక్టును పూర్తి చేసి త్వరలోనే రైతులకు అంకితమిస్తాం
  • రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి   
  • కలెక్టరేట్‌లో జాతీయ పతాకం ఆవిష్కరణ

వనపర్తి : జిల్లా అభివృద్ధికి కంకణబద్దులై పనిచేద్దామ ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం 8:45 గంటలకు వనపర్తి పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి మంత్రి నిరంజన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జెడ్పీ చైర్మ న్‌ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా, ఎస్పీ అపూర్వరావులతో కలిసి మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. జూరాల ప్రాజెక్టు కింద గతేడాది వానకాలంలో 69,975 ఎకరాలకు, యాసంగిలో 20 వేల ఎకరాలకు సాగునీరందించామన్నారు.

భీమా లిఫ్ట్‌-2 కింద వానకాలంలో 7.61 టీఎంసీల నీళ్లతో 128 చెరువులను నింపుకొని 53,300 ఎకరాలను సస్యశ్యామలం చేశామన్నారు. రూ.21.48 కోట్ల నిధులతో బుద్దారం కుడి కాలువను 19.1 కిలోమీటర్ల మేర తవ్వామని, మిగతా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వీరాంజనేయ బ్యాలెన్సిం గ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి 4,380 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 4,208 ఎకరాల ను సేకరించి రూ.198 కోట్లను నష్ట పరిహారంగా చెల్లించామని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను త్వరలో పూర్తి చేసి రైతులకు అంకితమిస్తామని చెప్పారు. మిషన్‌ కాకతీయ కింద రూ.204.68కోట్లతో 800 చెరువులు పునరుద్ధరించామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా 359 ఆవాసాల్లో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో 351 మంది రైతులు మరణించగా.., 317 మందికి రైతుబీమా కింద రూ.15.8 కోట్లను నామినీ ఖాతాల్లో జ మచేశామన్నారు. నాబార్డ్‌ పథకం కింద రూ. 30 కోట్లతో 11 వ్యవసాయ మార్కెట్‌ గోదాంలను నిర్మించామని చెప్పారు. 1,74,956 ఖాతాలను భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా శు ద్ధీకరించి 1,52,004 ఖాతాలకు సంబంధిం చి పట్టాదారు పాస్‌పుస్తకాలను జారీ చేశామన్నారు.

రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద 136 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పాం సాగు చేస్తున్నట్లు చెప్పారు. 400 చెరువుల్లో 1.49 కోట్ల చేపపిల్లలను సరఫరా చేయగా, 12,638 టన్నుల సంపద వచ్చి 8,242 మత్స్య కుటుంబాలకు ల బ్ధి చేకూరిందన్నారు. 31 మార్చి 2016 నుంచి ఇప్పటివరకు డీడీలు చెల్లించిన 12,674 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చి రూ.79.42 కోట్లు ఖర్చు చేశామన్నారు. 2020 సంవత్సరంలో 39.96 లక్షల మొక్కలను హరితహారం లక్ష్యంగా పెట్టుకున్నామని చె ప్పారు. వివాహం చేసుకున్న 26 మంది వికలాంగులకు ప్రోత్సాహకంగా లక్ష చొప్పున ఇచ్చామన్నారు. స్వయం ఉపాధి పథకం కింద రూ.11.95 కోట్ల విలువ గల 715 యూ నిట్లు మంజూరు చేశామన్నారు. టీయూఎఫ్‌ఐడీసీ నిధు ల కింద వనపర్తి పట్టణంలో రూ.20కోట్ల నిధులతో 12 పనులకు అనుమతులు పొందగా మూడు పనులు పూర్తయ్యాయన్నారు. కొప్పునూర్‌లో  రూ.1.50కోట్ల విలువ గల 11, 436 క్వింటాళ్ల శనగలను 859 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు.

జిల్లాలో 639 మంది చేనేత కార్మికులను చేనేత మిత్ర పథకంలో చేర్చామని చెప్పారు. 2019-20 సంవత్సరానికి గాను జిల్లా కు ఆదాయ లక్ష్యం రూ.6,33,54,000 కాగా ఇప్పటివరకు రూ.4, 63,64,000 రాయితీ రూపంలో ఖజానా లో జమ చేయడం జరిగిందన్నారు. 2020 మే నెలలో జిల్లా సరాసరి భూగర్భ జలమట్టం 5.15 మీటర్లు కాగా, ఈ ఏడాది 7.63 మీటర్లు ఉన్నదని, గతంతో పోలిస్తే 2.48 మీటర్లు పెరిగిందన్నారు. అనంతరం 147 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. కలెక్టరేట్‌ ఆవరణలో మొక్క నాటి మం త్రి, కలెక్టర్‌, ఎస్పీ నీటిని పోశారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్‌ డీ వేణుగోపాల్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా చై ర్మన్‌ లక్ష్మయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చై ర్మన్‌ వాకిటి శ్రీధర్‌, అధికారులు పాల్గొన్నారు.


logo