ఆదివారం 12 జూలై 2020
Nagarkurnool - May 29, 2020 , 03:21:59

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

మండల సర్వసభ్య సమావేశంలో  డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి 

రాజాపూర్‌ : ప్రజారోగ్యం సంరక్షణపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ పట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ సుశీల అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి డీసీఎంఎస్‌ చైర్మన్‌ హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలన్నారు. మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం తో పని చేయాలని సూచించారు. అంతకుముందు వివిధ శాఖల అధికారులు అభివృద్ధి పనుల ప్రగతిని సభ్యులకు తెలియజేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పలువురు సర్పంచులు సభ దృష్టికి తీసుకొచ్చారు. సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడంతో జెడ్పీటీసీ మోహన్‌నాయక్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో బాదేపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పీ మురళి, వైస్‌ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, తాసిల్దార్‌ శంకర్‌, ఎంపీడీవో లక్ష్మీదేవి ఉన్నారు. 


logo