ఆదివారం 12 జూలై 2020
Nagarkurnool - May 29, 2020 , 03:21:56

పనుల్లో నాణ్యత పాటించాలి

పనుల్లో నాణ్యత పాటించాలి

 రోడ్లు, చౌరస్తాల విస్తరణతో పట్టణానికి కొత్త శోభ

 ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌/మున్సిపాలిటీ : జిల్లా కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం వన్‌టౌన్‌ చౌరస్తా అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అనేక అభివృద్ధి కా  ర్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. రోడ్ల విస్తరణ, చౌరస్తాల అభివృద్ధితో పట్టణానికి కొత్తశోభ వస్తుందన్నా రు. చౌరస్తాల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం హన్వాడకు చెందిన రవీందర్‌గౌడ్‌కు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.3లక్షల ఎల్‌వోసీని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అం దజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, హన్వాడ ఎంపీపీ బాల్‌రాజ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్‌, మా ర్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాజేశ్వర్‌, కమిషనర్‌ సురేందర్‌ పాల్గొన్నారు. 


logo