మంగళవారం 11 ఆగస్టు 2020
Nagarkurnool - May 28, 2020 , 05:52:48

బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు

బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు

అమ్రాబాద్‌ : మండలంలో జరుగుతున్న ఓ బాల్యవివాహాన్ని బుధవారం అధికారులు అడ్డుకున్నారు. అమ్రాబాద్‌ మండలంలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్‌ బాలికతో మండలంలోని లక్ష్మాపూర్‌ బీకే గ్రామానికి చెందిన నల్లవెల్లి మస్తాన్‌తో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విష యం తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు, పోలీస్‌ సిబ్బంది చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిలర్‌ తదితరులు గ్రామానికి చేరుకొని ఇరు కుటుంబాల తల్లిదండ్రులతో మాట్లాడారు. 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వివాహం చేయమని వారితో రాతపూర్వకంగా రాయించుకున్నారు. అనంతరం కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీవో ధమయంతి, సూపర్‌వైజర్‌ కమల, ఎస్సై వెంకటయ్య, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిలర్‌ మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo