శుక్రవారం 14 ఆగస్టు 2020
Nagarkurnool - May 28, 2020 , 05:50:05

ఉపాధి పనులను పకడ్బందీగా అమలు చేయాలి

ఉపాధి పనులను పకడ్బందీగా అమలు చేయాలి

  •   ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు 

అచ్చంపేట/బల్మూరు : కరోనా నేపథ్యంలో గ్రామాలకు వచ్చిన పేదలు, కూలీలందరికీ జాబ్‌కార్డులు అందించి పని కల్పించాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సూచించారు. బుధవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయం వద్ద బల్మూరు మండలానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉపాధిహామీ పథకం అమలు తీరుపై సమీక్షించి గ్రామాల వారీగా పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎవరైన ఏకపక్షంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పనులు చేసిన వారికి డబ్బులు వస్తున్నాయా.. మండలంలో ఎన్ని జాబ్‌కార్డులు ఉన్నాయి.. ఎంతమంది పనిచేస్తున్నారు.. ఎలాం టి పనులు చేస్తున్నారనే వాటిపై ఆరా తీశారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

పనిచేసే వారిపేర్లు మాత్రమే మస్టర్లో ఉండాలని రైతులకు ఉపయోగపడే పనులు చేయించాలని అన్నారు. అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎక్కువ మందికి పని కల్పిస్తే  అంత ఉపయోగకరంగా ఉం టుందని అన్నారు. పంచాయతీ అధికారులు, సర్పంచులు, ఉపాధిహామీ సిబ్బంది, ప్రజాప్రతిధులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ఏమైన సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బల్మూరు మండలంలోని పోలిశెట్టిపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ యువనాయకుడు అంజి పెళ్లి వేడకల్లో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.  అనంతవరంలో జరిగిన పెళ్లి వేడుకల్లో ప్రభుత్వ విప్‌ గువ్వల , ఎంపీ రాములు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ లక్ష్మమ్మ, పీఏసీఎస్‌ చైర్మన్‌ నర్సయ్యయాదవ్‌, సర్పంచ్‌ దేశ్యానాయక్‌, ఎంపీడీవో దేవన్న, ఏపీవో వెంకటయ్య, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.logo