బుధవారం 05 ఆగస్టు 2020
Nagarkurnool - May 27, 2020 , 02:07:10

తనిఖీలు ముమ్మరం

తనిఖీలు ముమ్మరం

నాలుగున్నర టన్నుల బెల్లం పట్టివేత 

6 వాహనాలు సీజ్‌..55 మందిపై కేసులు 

అచ్చంపేట రూరల్‌: లాక్‌డౌన్‌ సమయంలో వ్యాపారు లు, ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తూ వివిధ కేసుల్లో పట్టుబడ్డారు. ఈ తరుణంలో పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది తనిఖీలను విస్తృతం చేసి 27వాహనాలను సీజ్‌ చేశారు. మార్చి 22 నుంచి వైన్స్‌ దుకాణాలు మూతపడడంతో బెల్లం, సారా వ్యాపారానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. అచ్చంపేట, అమ్రాబాద్‌, పదర, ఉప్పునుంతల, బల్మూర్‌ మండలాల పరిధిలో సారా సరఫరా, తయారు చేస్తున్న 37మందిపై కేసులు నమోదు చేసి, 213 లీటర్ల సారాను, 3,220 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాలుగు వాహనాలను సీజ్‌ చేశారు. సారా తయారీ కోసం ఉంచిన బెల్లం నిల్వ, రవాణా చేస్తుండగా రెండు టన్నులన్నర బెల్లం, 410 కిలోల స్పటికను ఎక్సైజ్‌ ఇన్‌చార్జి సీఐ అనంతయ్య స్వాధీనం చేసుకోగా, చౌటపల్లిలో రెండు టన్నుల బెల్లాన్ని సీఐ రామకృష్ణ, ఎస్సై ప్రదీప్‌కుమార్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి రెండు వాహనాలను సీజ్‌ చేశారు. అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్న ఆరు మందిపై కేసు నమోదు చేసి 14.91 లీటర్ల మద్యం, 36.4 లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకున్నారు. అమ్రాబాద్‌ మండలంలోని తుర్కపల్లిలో మద్యం అధిక ధరలకు అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్దంగా కల్లు విక్రయిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసి 155.6 లీటర్ల కల్లును పారబోశారు. లాక్‌డౌన్‌లో వైన్స్‌ దుకాణాలు సీజ్‌ చేసి ఉన్నప్పటికీ ఆయా దుకాణాల నిర్వాహకులు మాత్రం వెనుక మరో డోర్‌ నుంచి మద్యాన్ని  ఖాళీ చేసి అధిక ధరలకు విక్రయించిన విషయం సంబంధిత అధికారులకు తెలిసిందే. విషయం ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారుల వరకు వెళ్లినా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు చర్చించుకుంటున్నారు.logo