ఆదివారం 09 ఆగస్టు 2020
Nagarkurnool - May 25, 2020 , 02:36:33

పోలీస్‌ దిగ్బంధంలో రామచంద్రాపురం

పోలీస్‌ దిగ్బంధంలో రామచంద్రాపురం

507 మందికి వైద్య పరీక్షలు

క్వారంటైన్‌కు కరోనా బాధితుడి కుటుంబీకులు

కంటైన్మెంట్‌ జోన్లుగా మూడు జిల్లాల్లోని నాలుగు  గ్రామాలు 

చారకొండ : నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని రా మచంద్రాపురంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో గ్రామాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆదివారం మండల వైద్యాధికారి రూప ఆధ్వర్యంలో ఆశకార్యకర్తలు 132 ఇండ్లల్లోని 507 మందికి పరీక్షలు చేశారు. వైద్య పరీక్షలో ఇద్దరికి జలుబు ఉ న్నట్లు నిర్ధారించారు. ఈ ఇరువురికి మందులు పంపిణీ చేసి స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. గ్రామస్తులకు హోంక్వారంటైన్‌ ముద్రలు వేసి, ఇంటి నుంచి ఎవరూ బయటికి రావొద్దని వైద్యు లు సూచించారు. కరోనా బాధితుడి భార్య, తల్లి, కుమారుడిని నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. మండల పంచాయతీ అధికారి నారాయణ ఆధ్వర్యంలో శానిటేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. గ్రామం నుంచి ఎవరూ బయటికి వెళ్లకుం డా, ఇతరులు గ్రామంలోకి రాకుండా వెల్దండ సీఐ నాగరాజు, చారకొండ, వంగూరు ఎస్సైలు కృష్ణదేవ, బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామా న్ని బారికేడ్లు వేసి దిగ్బంధించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం స ర్వారెడ్డిపల్లి, నల్లగొండ జిల్లా డిండి మండలం రామాంతాపురం, రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని గిరికొత్తపల్లి గ్రామాల్లో బం ధువులు ఉండడంతో కరోనా బాధితుడు ఇటీవల ఆ ఊర్లకు వెళ్లాడు. దీంతో ఆయా గ్రామాల్లో అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించి కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. మొత్తం మూడు జిల్లాల్లో నాలుగు గ్రామాలను కంటైన్మెంట్లు జోన్లుగా ప్రకటించారు. కరోనా పాజిటివ్‌ రావడంతో చారకొండ మండలకేంద్రంలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసి ఉంచారు. కల్వకుర్తి-దేవరకొండ ఆర్టీసీ బస్సుల రాకపోకలు బంద్‌ చేశారు. logo