మంగళవారం 26 మే 2020
Nagarkurnool - May 15, 2020 , 02:17:39

పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నాం

పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నాం

  • విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి

జడ్చర్ల/రాజాపూర్‌ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 203జీవోను వి డుదల చేసి పోతిరెడ్డిపాడుకు అదనంగా కృష్ణా జలాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నదని, దానిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప థకాన్ని సీఎం మంజూరు చేసినట్లు తెలిపారు. 203జీవో ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుందని, వారి ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజాపూర్‌లో దోండ్లపల్లి ఎంపీటీసీ అభిమన్యురెడ్డి అందించిన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే పేదలకు అందించారు. రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం కుటుంబాలకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. సమావేశంలో సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీవైస్‌ చైర్మన్‌ యాద య్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మురళి, కమిషనర్‌ సునీత పాల్గొన్నారు.


logo