సోమవారం 01 జూన్ 2020
Nagarkurnool - May 14, 2020 , 02:15:38

ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వండి

ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వండి

  • మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్రావు 

మహబూబ్‌నగర్‌ : ఇంటింటికీ అందిస్తున్న తాగునీటి ప్రక్రియ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు. బుధవారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో అధికారులతో ఆయన మాట్లాడారు. పైపులైన్ల పనులు, ట్యాంకుల నిర్మాణం వందకు వంద శాతం పూర్తి చేసి, గ్రామ పంచాయతీ, సెక్రటరీల సంతకాలతో కూడిన పత్రాలను తమకు అందించాలన్నారు. పనులు చేసే సమయంలో భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. తదుపరి నిర్వహించే సమావేశానికి పూర్తి స్థాయి నివేదికలతో హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి కలెక్టర్‌ వెంకట్రావు హాజరై మాట్లాడారు. కరోనా నివారణ చర్యలు, ఇతర విషయాలపై సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోహన్‌లాల్‌, డీపీవో వెంకటేశ్వర్లు, మిషన్‌ భగీరథ ఈఈ వెంకట్‌రెడ్డి, ఈఈ వెంకట రమణ పాల్గొన్నారు. 

దివ్యాంగులు ఇంటి నుంచే విధులు నిర్వహించండి 

దివ్యాంగులైన ప్రభుత్వ ఉద్యోగులు లాక్‌డౌన్‌ పీరియాడ్‌లో వారి ఇండ్ల నుంచే విధులు నిర్వహించేలా ప్రభుత్వం మినహాయింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్‌ వెంకట్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెడ్‌, ఆరెంజ్‌ జోన్లలో సైతం దివ్యాంగ ఉద్యోగులు వారి ఇండ్ల నుంచే పనిచేసే వెసులుబాటు ఉందన్నారు. 


logo