గురువారం 28 మే 2020
Nagarkurnool - May 14, 2020 , 02:15:44

ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలి

ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలి

  • ఎమ్మెల్యే మర్రి 

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/తాడూరు: ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు విధిగా అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సూచించారు. బుధవారం తాడూరు తాసిల్దార్‌ కార్యాలయం నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, తాసిల్దార్లు, మండల మెడికల్‌ ఆఫీసర్లు, పీఏసీసీఎస్‌ చైర్మన్లు, అగ్రికల్చర్‌, విద్యుత్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా సాయం కింద ప్రభుత్వం రూ.1500 నగదు, రేషన్‌కార్డులోని ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం అందిస్తున్నదని, వీటన్నింటినీ ప్రజలకు అందేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ గురించి ఆరా తీశారు. వీసీలో డీపీవో సురేశ్‌మోహన్‌, ఆర్డీవో నాగలక్ష్మి, డాక్టర్‌ సుధాకర్‌లాల్‌, ఎంపీడీవోలు, పీఏసీసీఎస్‌ చైర్మన్లు పాల్గొన్నారు.


logo