శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - May 12, 2020 , 02:08:01

హలో రాములు.. బాగున్నారా!

హలో రాములు.. బాగున్నారా!

  • కరోనాపై ఎంపీ రాములను ఆరా తీసిన ఉపరాష్ట్రపతి

కల్వకుర్తి : కరోనాతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రా ములుతో మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఉపరాష్ట్రపతి ఎంపీతో సో మవారం ఫొన్‌లో మాట్లాడారు. మీ ప్రాంతంలో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉంది అంటూ ఎంపీ ని ఆరా తీశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సూచనలు చేస్తున్నారని ఎంపీ ఉపరాష్ట్రపతికి వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎ స్పీలు, వైద్య, ఆరోగ్య, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ సిబ్బంది కష్టిం చి పనిచేస్తున్నారని తెలిపారు. మేము కూడా కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నందుకు ఎంపీ రాములు ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు.


logo