శనివారం 30 మే 2020
Nagarkurnool - May 10, 2020 , 02:38:52

తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి

తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి

  • సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌

జడ్చర్ల : కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని, మాస్క్‌ లేకుండా ఎవరూ బయటికి రావొద్దని సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌ అన్నారు. శనివారం సీఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జడ్చర్లలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు అందరూ స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు. మొత్తం 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మురళి, డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహులు, సతీశ్‌, జహంగీర్‌ తదితరులు పాల్గొన్నారు. logo