శనివారం 30 మే 2020
Nagarkurnool - May 09, 2020 , 02:48:40

కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి

కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలి

మరికల్‌ : ఉపాధి కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నా రాయణపేట జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ సూచించారు. శుక్రవారం మండలంలోని చిత్తనూర్‌, పెద్ద చింతకుంట గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. పనుల వద్ద భౌతిక దూరం పాటించాలన్నారు. కూలీలకు మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర మొక్కలను నాటి నీరు పోశారు. ఆయా కా ర్యక్రమాల్లో జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ కళారాజవర్ధన్‌రెడ్డి, సర్పంచులు అరుంధతి, గోవర్ధన్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు దేవేందర్‌ రెడ్డి, గోపాల్‌, సుజాత, మంజుల, తీలే రు, ధన్వాడ సింగిల్‌విండోల అధ్యక్షులు రాజేందర్‌గౌడ్‌, వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo