బుధవారం 27 మే 2020
Nagarkurnool - May 09, 2020 , 02:48:41

లాక్‌డౌన్‌ ముగిసేనాటికి భగీరథ నీరివ్వాలి

లాక్‌డౌన్‌ ముగిసేనాటికి భగీరథ నీరివ్వాలి

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ/మక్తల్‌ రూరల్‌ : మూడో దశ లాక్‌డౌన్‌ ముగిసేనాటికి మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరందించాలని ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఆత్మకూరు, అమరచింత మండలాల్లో గ్రామాల వా రీగా జరిగిన మిషన్‌ భగీరథ పనులపై అధికారులు, గుత్తేదారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మే చివరి వరకు రెండు మం డలాల్లో పనులు పూర్తిచేసి, జూన్‌ నుంచైనా మిషన్‌ భగీరథ నీరివ్వాలని ఎ మ్మెల్యే ఆదేశించారు. అనంతరం వాటర్‌ డే సందర్భంగా ఆత్మకూరు ఐబీ అతిథిగృహం ప్రాంగణంలో, మక్తల్‌ మండలంలోని పస్పుల గ్రామంలో నా టిన మొక్కలకు ఎమ్మెల్యే చిట్టెం నీళ్లు పోశారు. ఆత్మహత్య చేసుకున్న యారోనిపల్లి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి కుటుంబానికి న్యాయం చేయాలని ఉమ్మడి మండలాల పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులు నిరసన వ్యక్తంచేసి ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. మక్తల్‌ మండలం దాదాన్‌పల్లిలో ఈజీఎస్‌ పథకం ద్వారా జరుగుతున్న ఫీడర్‌ ఛానల్‌ మరమ్మతు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీలు శ్రీనివాసులు, వనజ, వైస్‌ ఎంపీపీ కోటేశ్వర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు గాయత్రీయాదవ్‌, మంగమ్మగౌడ్‌, తాసిల్దార్‌ మోహన్‌, ఎంపీడీవో కృష్ణయ్య, మిషన్‌ భగీరథ ఈఈ మేఘారెడ్డి, వైస్‌చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, మక్తల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ పావని, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo