శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - May 07, 2020 , 02:22:23

పేదలను అన్నివిధాలా ఆదుకుంటాం

పేదలను అన్నివిధాలా ఆదుకుంటాం

  • జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

నవాబ్‌పేట(జడ్చర్ల)/రాజాపూర్‌/బాలానగర్‌ : నియోజకవర్గంలోని పేదలను అన్నివిధాలా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం నవాబ్‌పేట మండలంలోని ఆశ కార్యకర్తలకు సీఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన అజిలాపూర్‌ గ్రామ టీఆర్‌ఎస్‌ కార్యకర్త బాలరాజును ఎమ్మెల్యే పరామర్శించి రూ.50వేల ఆర్థిక సాయం చేశారు. బాలానగర్‌ మండలం పెద్దాయపల్లిలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ పట్ల ప్రభాకర్‌రెడ్డి దివ్యాంగుల కోసం సమకూర్చిన సరుకులను పంపిణీ చేశారు. రాజాపూర్‌ మండలం దోండ్లపల్లి గ్రామంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన రైతు పెద్ద బుచ్చన్నకు సీఎం రిలీప్‌ ఫండ్‌ నుంచి మంజూరైన రూ.5లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, జెడ్పీటీసీ కల్యాణీ లక్ష్మణ్‌నాయక్‌, ఎంపీపీ సుశీల, ఎంపీటీసీ అభిమన్యురెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్‌, మండలాల అధ్యక్షులు శ్రీశైలంయాదవ్‌, శ్రీనివాసరావు, వైస్‌ ఎంపీపీ వెంకటాచారి, సర్పంచ్‌ లక్ష్మీదేవి పాల్గొన్నారు. logo