శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - May 07, 2020 , 02:22:23

దుకాణాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలి

దుకాణాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలి

  • ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

అచ్చంపేట రూరల్‌/అమ్రాబాద్‌ రూరల్‌: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, దుకాణాల వద్ద వ్యాపారులు శానిటైజర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా గ్రీన్‌జోన్‌లోకి వచ్చిన నేపథ్యంలో బుధవారం అచ్చంపేట పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దుకాణదారులు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే తెరుచుకోవాలని సూచించారు. స్వీయ నియంత్రణ, నిర్ణీత దూరాన్ని పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు. అమ్రాబాద్‌ మండలంలోని మాచారంలో గాలివానకు టీఆర్‌ఎస్‌ కార్యకర్త గోపాల్‌ రేకుల ఇంటి పైకప్పు కూలిపోవడంతో విషయం తెలుసుకున్న విప్‌ గువ్వల బాలరాజు అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో విండో చైర్మన్‌ మనోహర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ తులసీరాం, వైస్‌ చైర్మన్‌ రాజు, కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఆర్డీవో పాండు, తాసిల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపీపీ శాంతాలోక్యానాయక్‌ ఉన్నారు.logo