శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - May 06, 2020 , 02:17:14

జర్నలిస్టుల సేవలు మరువలేనివి

జర్నలిస్టుల సేవలు మరువలేనివి

వనపర్తి సాంస్కృతికం : లాక్‌డౌన్‌లో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు మరువలేనివని ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి ఎలిశెట్టి వెంకటేశ్‌ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆ సంఘం సభ్యులు జర్నలిస్టులకు ఫుల్‌ఫేస్‌ మాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ ప్రజలకు కరోనా వ్యాధిపై అవగాహన కల్పించడంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కృష్ణమోహన్‌, సాయిబాబా, మూర్తి, శ్రీనివాసులు, రాజు, రమేశ్‌, మంజుల, భారతి, రాములు, మహేశ్‌, సాయిప్రసాద్‌, వేణు పాల్గొన్నారు. 


logo