మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Apr 27, 2020 , 02:04:36

ఆకలి తీరుస్తున్న అన్నదానం

ఆకలి తీరుస్తున్న అన్నదానం

నారాయణపేట టౌన్‌/భూత్పూర్‌/జడ్చర్ల/పాన్‌గల్‌/వనపర్తి టౌన్‌/వైద్యం : నారాయణపేట పట్టణంలోని శివలింగేశ్వ ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులకు ఆదివారం అన్నదానం చేశారు. భూత్పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని అమిస్తాపూర్‌లో మూడురోజులుగా వాహనదారులకు భోజన ప్యాకెట్లు అందిస్తున్న స్వామి వివేకానంద యువజన సంఘం సభ్యులను తాసిల్దార్‌ చెన్నకిష్టన్న అభినందించారు. బాటసారులకు, వలసకూలీలకు, అనాథలకు జడ్చర్ల అయ్యప్ప సేవాసమితి ఆ ధ్వర్యంలో 300 భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. పాన్‌గల్‌ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఆయా శాఖల సిబ్బందికి వనపర్తికి చెందిన మేస్త్రీ శ్రీనివాసులు సాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో భోజనాన్ని ఏర్పాటు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన పోలీసులకు వాసవీ సప్లయర్స్‌ ఆధ్వర్యంలో అల్పాహారం, భో జనం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు నవీన్‌కుమార్‌ గుప్తా తెలిపారు. వనపర్తి జిల్లా దవాఖాన, పారిశుధ్య సిబ్బందికి, రో గులకు అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ వాసవీ సేవాసమితి జాతీయ అధ్యక్షుడు సురేశ్‌శెట్టి, జిల్లా కార్యదర్శి దాచ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అన్నదానం, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. 


logo