శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Apr 24, 2020 , 01:54:56

కరోనా నియంత్రణకు కఠిన చర్యలు

కరోనా నియంత్రణకు కఠిన చర్యలు

  • జోగుళాంబ గద్వాల జిల్లా ప్రత్యేక అధికారి రొనాల్డ్‌రోస్‌

గద్వాల, నమస్తే తెలంగాణ : కరోనా నియంత్రణకు కంటైన్‌మెంట్‌ ఏరియాల్లో క ట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రత్యేక అధికారి రొనాల్డ్‌రోస్‌ పేర్కొన్నా రు. ప్రతి రోజూ ఇంటింటికీ వెళ్లి ఆశ కార్యకర్తలు సేకరిస్తున్న సమాచారాన్ని వైద్యులు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ శ్రుతి ఓఝా, ఇంచార్జి ఎస్పీ అపూర్వరావుతోపాటు వైద్యశాఖ అధికారులతో కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను ట్రేస్‌ అవుట్‌ చేసే విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కార్మికులకు ఇప్పటివరకు అందించిన సహాయ సహకారాలపై ఆర్డీవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీహర్ష, జిల్లా వైద్యాధికారి శశికళ, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ నవీన్‌క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.


logo