ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Apr 24, 2020 , 01:52:58

ఇండ్లల్లోనే రంజాన్‌ నిర్వహించుకోవాలి

ఇండ్లల్లోనే రంజాన్‌ నిర్వహించుకోవాలి

  • మత పెద్దలతో ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

మహబూబ్‌నగర్‌ నమస్తే తెలంగాణ/మున్సిపాలిటీ /భూత్పూర్‌ : రంజాన్‌ పండుగను భక్తి శ్రద్ధలతో తమ తమ ఇండ్లల్లోనే నిర్వహించుకోవాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి  శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో ముస్లిం మతపెద్దలతో ఏర్పా టు చేసిన పీస్‌ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా వ్యాప్తి చెందుతున్నదని, ఇప్పటికే మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవాలయాలు, మసీదు, చర్చీలు మూసివేసినట్లు తెలిపారు. ముస్లింలు ఇంట్లోనే రంజాన్‌ పండుగను జరుపుకోవాలని, ప్రార్థనలు నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు. రంజాన్‌ వేళలో పండ్లు అందుబాటులో ఉండేలా చూస్తామని మంత్రి అన్నారు. అనంతరం మాస్క్‌లు, శానిటైజర్లు అందజేశారు. కలెక్టరేట్‌లో కరో నా సహాయార్థం పోలేపల్లి సెజ్‌లోని హెటిరో ఫార్మా త రఫున జనరల్‌ మేనేజర్‌ చంద్రారెడ్డి రూ.5 లక్షల చెక్కు, రూ.3 లక్షల విలువ చేసే శానిటైజర్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అందజేశారు.

నిర్ణీత దూరం పాటించాలి

నిర్ణీత దూరం పాటించి కరోనా కట్టడికి కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. పట్టణంలోని ఏనుగొండ, లక్ష్మీనగర్‌ కాలనీలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని, స్వీయ నియంత్రణలో ఉంటేనే కరోనా వైరస్‌ సోకదన్నారు. అందరి సహకారంతో జిల్లాలో కరోనా వైరస్‌ నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏనుగొండ లో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కోరమోని వెంకటయ్య, లక్ష్మీనగర్‌ కాలనీలో రిటైర్డ్‌ ఉద్యోగులు నిత్యావసర సరుకు లు సమకూర్చినట్లు తెలిపారు. న్యూటౌన్‌ అవంతి హో టల్‌ సమీపంలో గల కూరగాయల మార్కెట్‌ను మంత్రి పరిశీలించారు. చిన్నదర్‌పల్లిలో ప్రశాంత్‌హోటల్‌ ఆధ్వర్యంలో సరుకులను పంపిణీ చేశారు. షాషాబ్‌గుట్ట, బో యపల్లిగేట్‌తో పాటు 32 ప్రాంతాలలో బారికేడ్లను పరిశీలించారు. భూత్పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో దేవరకద్ర నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నిర్వహించారు. కరోనా ప్రభావం దృష్ట్యా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రంజాన్‌ ఉపవాసాలను ముస్లింలు ఇండ్లల్లోనే నిర్వహించుకోవాలని మం త్రి కోరారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరి, అడిషనల్‌ కలెక్టర్‌ మోహన్‌లాల్‌, అడిషనల్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, డీఆర్వో స్వర్ణలత, ఆ ర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌, ఎంపీపీలు కదిరె శేఖర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌ బస్వరాజ్‌గౌడ్‌, తాసిల్దార్‌లు చెన్నకిష్టన్న, జ్యోతి, శ్రీనివాస్‌, కో ఆప్షన్‌ స భ్యుడు ఖాజా, నియోజకవర్గంలోని మైనార్టీ నాయకు లు అహ్మద్‌, సాధిక్‌, సత్తార్‌, అసద్‌, సాబేర్‌ పాల్గొన్నారు. 


logo