శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Apr 06, 2020 , 01:50:55

ఈ రెండు వారాలు చాలా ముఖ్యం

ఈ రెండు వారాలు చాలా ముఖ్యం

  • ఆయా జిల్లాల కలెక్టర్ల వీసీలో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబా

మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నమస్తే తెలంగాణ/నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : కరోనా కట్టడిలో రానున్న రెండు వారాలు చా లా ముఖ్యమని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబా అన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి అన్ని రాష్ర్టాల చీఫ్‌ సెక్రటరీలు, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల అధికారులు, అన్ని జిల్లా ల కలెక్టర్లు, ఎస్పీలు, పురపాలక, వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సం దర్భంగా రాజీవ్‌గౌబా మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ను కఠినంగా అమలు చేయాలన్నారు. కరోనా పా జిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో ఎవరూ బయటకు రాకుండా చూస్తూ వారికి అసవరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎవరైనా లాక్‌డౌన్‌ను అతిక్రమించి బయటకు వస్తే తగు చర్యలు తీసుకోవాలని, వైద్యసహాయం అందించే వారిపై దా డులకు పాల్పడే వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాజిటివ్‌ కేసులు నమోదైన చోట బార్డర్‌ జిల్లాలకు సీ జ్‌ చేయడం, జిల్లా కం ట్రోల్‌ రూం కాల్‌ సెంటర్ల ను చైతన్యం చేయాలన్నా రు. క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు బయటకు రాకుం డా చూడాలన్నారు. కరో నా నియంత్రణలో భాగం గా అవసరమైన మందు లు, పారిశుధ్య చర్యలపై దృష్టి సారించాలని సూ చించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని, రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు లబ్ధిదారులకు 12 కిలోల బియ్యం, రూ.1500 ఇస్తున్నామని తెలిపారు. వీసీలో ఆయా జిల్లాల కలెక్ట ర్లు షేక్‌ యాస్మిన్‌బాషా, శ్రుతి ఓఝా, ఎస్‌.వెంకట్రావు, శ్రీధర్‌, ఎస్పీలు అపూర్వరావు, రెమా రా జేశ్వరి, సాయిశేఖర్‌, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, శ్రీనివాస్‌రెడ్డి, మనూచౌదరి, హనుమంత్‌ రెడ్డి, జోగుళాంబ గద్వాల అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీ హర్ష, అదనపు డీఎంహెచ్‌వో శశికళ, దవాఖాన సూపరింటెండెంట్‌ నవీన్‌క్రాంతి, అధికారులు సుధాకర్‌లాల్‌, అఖిలేష్‌రెడ్డి, అనిల్‌ప్రకాష్‌ ఉన్నారు.


logo