గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Apr 06, 2020 , 01:45:58

పాటల రూపంలో అవగాహన కల్పించండి

పాటల రూపంలో అవగాహన కల్పించండి

  • ప్రత్యేక గీతాలను ఆవిష్కరించిన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని పాటల రూపంలో అవగాహన కల్పించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రూ పొందించిన గీతాలను ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆవిష్కరించారు. అనంతరం రచయితలు, గాయకులను మంత్రి అభినందించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ అత్యవసర సేవలందిస్తున్న వారికి గుర్తింపుగా ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించాలని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణకు సూచించారు. కార్యక్రమంలో దర్శకుడు నరేందర్‌గౌడ్‌ నంగునూరి, ప్రముఖ గీత రచయిత, సాంస్కృతిక సారథి కళాకారుడు అభినయ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. 

సీఎమ్మార్‌ఎఫ్‌ చెక్కు అందజేత

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లికి చెందిన తులసి హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ క్రమంలో తన వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్‌ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.2లక్షల చెక్కును హైదరాబాద్‌లో తన క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అందజేశారు. 


logo