సోమవారం 01 జూన్ 2020
Nagarkurnool - Apr 01, 2020 , 02:18:29

తమవంతు సాయంగా..

తమవంతు సాయంగా..

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ/ లింగాల/ బల్మూరు/ నారాయణపేట టౌన్‌ : కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పలువురు దాతలు ముందుకొచ్చి తమవంతు సాయం అందించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వాగ్దేవి కళాశాల కరస్పాండెంట్‌ విజేత వెంకట్‌రెడ్డి, యాజమాన్య సభ్యులు సతీశ్‌రెడ్డి, కోట్ల శివకుమార్‌, రాఘవేందర్‌రావు రూ.50వేలు, ఒకటో వార్డు కౌన్సిలర్‌ రోజా వెంకటేశ్‌ రూ.25వేల విరాళాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అందజేశారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ గార్లపాటి కాశీనాథం కుమారుడు శివప్రసాద్‌ రూ.51వేల ఆర్థిక సాయాన్ని గ్రామ సర్పంచ్‌ నీలవేణికి అందజేశారు. మాస్కుల పంపిణీ, పారిశుధ్య పనుల కోసం అందజేసినట్లు తెలిపారు. అలాగే, బల్మూరు మండలంలోని రాంనగర్‌ తండా సర్పంచ్‌ శ్రీరాంనాయక్‌ అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజును క్యాంప్‌ కార్యాలయంలో కలిసి రూ.10వేల చెక్కు అందజేశారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ముందుకొచ్చి సాయం అందించడంపై గువ్వల బాలరాజు అభినందనలు తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్‌ విద్యార్థులు ప్రొఫైదా ఇరమ్‌, అయేషా తహ్రీమ్‌ తాము జమ చేసుకున్న రూ.5,112 విరాళాన్ని కలెక్టర్‌ హరిచందనకు అందజేశారు. logo