గురువారం 28 మే 2020
Nagarkurnool - Mar 10, 2020 , 00:32:10

హోలీ చెమ్మ కేళీ

హోలీ చెమ్మ కేళీ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/తాడూరు/తెలకపల్లి/బిజినేపల్లి/తిమ్మాజిపేట : జిల్లా వ్యాప్తంగా  హోలీ వేడుకలు కొనసాగాయి.  ఆదివారం రాత్రి గ్రామ కూడళ్ల వద్ద కాముడిదహనం  చేశారు. దేశంలో ప్రజల్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ముందస్తు హెచ్చరికలు అక్కడక్కడ వినిపించడంతో హోలీ వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు అంతగా ఆసక్తి కనబర్చలేదు. జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధులు యువతీ, యువకులతో రంగులతో చల్లుకుంటూ కలర్‌ఫుల్‌గా కనిపించే రహదారులు సోమవారం బోసిపోయాయి.కేవలం  పలు వీధుల్లో మాత్రమే మహిళలు, యువతీ, యువకులు, చిన్నారులు రంగులు చల్లుకుంటూ కనిపించారు. జిల్లా కేంద్రంలోని 6వ వార్డు హౌజింగ్‌ బోర్డు కాలనీలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వేడుకలు నిర్వహించుకున్నారు. ప్రతిసారి కలర్‌ఫుల్‌గా కనిపించే వేడుకలు ఈ సారి కాస్త తగ్గాయి. కరోనా వైరస్‌ ప్రభావం ప్రచారం రేగడంతో చాలా వరకు మహిళలు, యువతులు రంగులకు బడులుగా పసుపును పూసుకొని వేడుకలు జరుపుకున్నారు. అంతకు ముందు హౌజింగ్‌బోర్డు కాలనీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేసి మహిళలు వేడుకలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో హోలీ వేడుకల్లో  పాల్గొన్న జిల్లా అదనపు న్యాయమూర్తి రవికుమార్‌ న్యావాదులు మధుసూదన్‌రావు, రాధాకృష్ణ, శ్యాంప్రసాద్‌రావు, శ్రీనివాస్‌ గుప్తా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.  జిల్లా కేంద్రంలోని పలు వీధుల్లో యువకులు రంగులు చల్లుకొని అనంతరం హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.  తాడూరు,  తెలకపల్లి, బిజినేపల్లి,తిమ్మాజిపేట,మండలకేంద్రాలతో పాటు మండలంలోని అన్ని  గ్రామాల్లో హోలి వేడుకలను నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు వీధుల్లో వచ్చి ఒకరిపై ఒకరూ రంగులు చల్లుకున్నారు. తాడూరు, తిమ్మాజిపేట మండలకేంద్రాల్లో  ఓ సంస్థ వారు  పసుపు ప్యాకెట్లు సరఫరా చేయడంతో వాటితోనే హోలీ నిర్వహించారు. సోమవారం తెలకపల్లి సంత కావడంతో 12 గంటల వరకు అక్కడక్కడ దుకాణాలు మూసి ఉంచినప్పటికి మధ్యాహ్నం 1గంట తర్వాత వ్యాపార సంస్థలు తెర్చుకున్నాయి. 


logo