గురువారం 28 మే 2020
Nagarkurnool - Mar 09, 2020 , 01:04:39

అన్ని రంగాల్లో అగ్రగామిగా అతివ

అన్ని రంగాల్లో అగ్రగామిగా అతివ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: ఎంతటి అత్యున్నత స్థానం పొందినా, ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్ర చక్కన బిడ్డలాంటివాడేనని, తల్లిలేనిది ఎలాంటి విజయాలు సాధించలేమని పార్లమెంట్‌ సభ్యులు పోతుగంటి రాములు అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్త్రీ శిశు సంక్షేమశాఖాధికారి ప్రజ్వల అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ  ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు ఒంటింటికే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో పురుషులతో సమానంగడా దూసుకుపోతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఒక తల్లిల్లా, చెల్లిలా, మహిళల్ని గౌరవంతో చూడాలన్నారు.  అంగన్‌వాడీ టీచర్ల సేవలను గుర్తించిన సీఎం  పెంచి ఇస్తున్నారన్నారు.  ప్రస్తుతం సమాజంలో ఆడ పిల్లలు అంటే తక్కువ చూపుతో చూస్తున్న వారి రక్షణకోసం స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సఖి, షీ-టీమ్‌ వంటి సేవలను వారికి ధైర్యాన్ని ఇస్తుందన్నారు.    జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి మాట్లాడుతూ ఆడ పిల్లలు భారంగా భావించి చిన్నతనంలో పెండ్లిడ్లు చేసుకున్న వారికి ప్రభుత్వం మనోధైర్యాన్ని కల్పించేలా కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ వంటి పథకాలను అందిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ  మహిళలు పలు పోటీలు నిర్వహించిన బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూగర్భజలశాఖాఆధికారి రమాదేవి, మున్సిపల్‌ చైర్మన్‌ కల్పన, కొల్లాపూర్‌ ఎంపీపీ సుధారాణి, వంగూరు, లింగాల జెడ్పీటీసీలు, నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లు పద్మమ్మ,   పాల్గొన్నారు. 


logo