శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Mar 09, 2020 , 00:59:20

అయ్యో బిడ్డా..

అయ్యో బిడ్డా..

కల్వకుర్తి రూరల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలంలోని ప్రభుత్వం దవాఖానలో ఓ 15 రోజుల పసికందును దవాఖానలో విడిచివెళ్లిన ఘటన శనివారం రాత్రి 12గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ పసికందు ఏడుపులు విన్న వారు ఆ పాప ఎవరిదంటూ దవాఖానాలో కాన్పు అయిన మహిళలను అడగగా తమ పిల్లలు తమ వద్దే ఉన్నారని చెప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దవాఖానాకు చేరుకున్న పోలీసులు ఆ పాపను శిశు సంరక్షణ కేంద్రానికి చేర్చారు. ఆపాప వద్ద అంగన్‌వాడీ టీచర్లను ఉంచి వైద్య సిబ్బందితో సేవలందించారు. ఆదివారం సాయంత్రం పసిబిడ్డను పాలమూరు జిల్లా కేంద్రంలోని శిశువిహార్‌కు తరలించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఇలా పసికందును వదిలివెళ్లిన సంఘటన ప్రజలలో ఆవేదన నింపింది.


logo