శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Mar 09, 2020 , 00:57:48

మహిళల సంక్షేమానికే అధిక ప్రాధాన్యం

మహిళల సంక్షేమానికే అధిక ప్రాధాన్యం

అచ్చంపేట రూరల్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని జీబీఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు గువ్వల అమల స్పష్టం చేశారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయంలో, ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  అన్ని రంగాల్లో రాణించేలా ధైర్యంతో ముందుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ పరిధిలో ప్లాస్టిక్‌ నిషేధం కొనసాగుతున్న తరుణంలో మాంసం తెచ్చుకునేందుకు మెప్మా సిబ్బందికి టిఫిన్‌ బాక్సులను అందజేశారు. పద్మశాలీ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎస్‌ఎవీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మంత్య్రానాయక్‌, బల్మూర్‌ ఎంపీపీ అరుణ, వైస్‌ చైర్మన్‌ విశ్వేశ్వర్‌నాథ్‌, కమిషనర్‌ వెంకటేశ్వర్లు, డీఎం మనోహర్‌, డాక్టర్‌ ప్రవీణ, శకుంతల,  పాల్గొన్నారు.  

అక్షరాస్యత పెంచినప్పుడే అభివృద్ధి సాధ్యం

లింగాల :  అక్షరాస్యత పెంపొందించినప్పుడే సమాజాభివృద్ధి చెందుతుందని   ట్రస్ట్‌ డైరెక్టర్‌ గువ్వల అమల అన్నారు.  అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో లింగాల,  మండలాలకు చెందిన చెంచు గిరిజన మహిళలచే మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.  సందర్భంగా శ్రీ కోదండరామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి గువ్వల అమల ముఖ్యఅతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.  కార్యక్రమంలో లింగాల,బల్మూర్‌ ఎంపీపీలు సర్పంచులు,    ఆర్డీటీ టీం లీడర్‌ సుధాకర్‌,  మాజీ జెడ్పీటీసీ మాకం పార్వతమ్మ ఆర్టీటీ సిబ్బంది పాల్గొన్నారు.


logo