శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Mar 09, 2020 , 00:57:01

యాసంగి పంటలకు కోయిల్‌సాగర్‌ నీటి విడుదల

యాసంగి పంటలకు కోయిల్‌సాగర్‌ నీటి విడుదల

దేవరకద్ర రూరల్‌ : కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆదివారం ఆయకట్టు రైతులకు మూడో విడుత సాగునీటిని విడుదల చేశారు. కోయిల్‌సాగర్‌ ఆయకట్టు రైతు లు ప్రాజెక్టు నీటిని నమ్ముకుని యాసంగి పంటలు సాగు చేశారు. ప్రాజెక్టు నుంచి నీటిని అధికారులతో మాట్లాడి విడిపించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. వెంటనే సంబంధిత అధికారులతోపా టు కలెక్టర్‌తో మాట్లాడారు. నాలుగు విడుతలుగా ఆ యకట్టు రైతులకు నీటిని విడుదల చేసేలా ఒప్పించారు. ఈ మేరకు మూడో విడుతగా కుడి కాలువ ద్వారా 180, ఎడమ కాలువ ద్వారా 90 క్యూసెక్కుల నీరు వి డుదల చేసినట్లు ప్రాజెక్టు ఈఈ చక్రధర్‌ తెలిపారు. ఎ మ్మెల్యే చొరవతో కోయిల్‌సాగర్‌ జలాల ద్వారా తాము వేసుకున్న పంటలు పండుతాయని భరోసా ఏర్పడింద ని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తొలి వి డుత జనవరి నెలలో 20వ తేదీ నుంచి 29 వరకు విడుదల చేయగా, రెండో విడుత ఫిబ్రవరి 14 నుంచి 23 వరకు నీటిని విడుదల చేశామని, మూడో విడుతగా నీటిని 17వ తేదీ వరకు విడుదల చేయనున్నట్లు ప్రాజె క్టు ఈఈ తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 24.6 అడుగుల నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 32 అడుగులు (2.3 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 24.6 అడుగుల నీటి నిల్వ ఉందని, తాగునీటి అవసరాల కోసం నారాయణపేట, కొడంగల్‌, మద్దూర్‌ మండలాలకు 10 క్యూసెక్కుల నీటి తరలింపు కొనసాగుతుందని తెలిపారు.


logo