శనివారం 30 మే 2020
Nagarkurnool - Mar 09, 2020 , 00:54:04

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : ప్రస్తుతం ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం చూపేందుకు ఎస్‌జీటీయూ ఉపాధ్యాయ సంఘం వెన్నంటే ఉంటుందని తెలంగాణ ఎస్‌జీటీయూ  జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌జీటీయూ  ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు ఆటలు, పాటల పోటీలను నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఆర్టీసీ డిపోలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ కండెక్టర్‌ను డీపో మేనేజర్‌ రామారావు సన్మానించారు. ఎస్‌జీటీయూ మండల అధ్యక్షుడు నిరంజన్‌, ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వర్‌రెడ్డి, గౌరవ సలహాదారు వెంకటేశ్‌, కోశాధికారి సతీష్‌, నర్సింహ, శ్రీనివాస్‌, రజినీకాంత్‌, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు వనజ, చేతనప్రియ, సౌమ్య, శ్రీలత పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

తిమ్మాజిపేట : మహిళలు, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని సర్పంచ్‌లు వేణుగోపాల్‌గౌడ్‌, నర్సింహరెడ్డి, మణెమ్మలు అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిమ్మాజిపేట, నేరళ్లపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి  ఆధునిక సమాజంలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నయన్నారు. రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో ఎంపీవో బ్రహ్మచారి, నేరళ్లపల్లి ఉపసర్పంచ్‌ ప్రదీప్‌, వార్డుసభ్యులు సైఫోద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

నవోదయలో మహిళా దినోత్సవం 

బిజినేపల్లి  : మండలంలోని వట్టెంలో గల జవహార్‌ నవోదయ విద్యాలయంలో  అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ వీరరాఘవయ్య, శివలీలలు మాట్లాడుతూ బాలికలు విద్యార్థి దశలో లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా ప్రాత్సహించాలన్నారు. అనంతరం మహిళలను పూలమాల,శాలువాలతో సన్మానించారు.  కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరాచారి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


logo