బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Mar 08, 2020 , 01:26:38

నర్సరీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : డీఆర్డీవో

నర్సరీలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : డీఆర్డీవో

చారకొండ /వంగూరు : పల్లెలు పచ్చదనంతో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో హరితహారంలో భాగంగా నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగిందని డీఆర్డీవో సుధాకర్‌ అన్నారు. శనివారం మండలంలోని మర్రిపల్లితండా, సారంబండతండా, జూపల్లి గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని గ్రామాల్లో నిరంతరం కొనసాగించాలని అన్నారు. నర్సరీల్లో రేజింగ్‌, కన్వర్షన్‌ బెడ్స్‌ టార్గెట్‌ ప్రకారం వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. నర్సరీల్లో విత్తనాలు నాటి రెండు సార్లు నీటి పట్టాలని వన సేవకులకు సూచించారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, కంపోస్టుషెడ్స్‌ నిర్మాణాలు ఈనెల 31వరకు పూర్తి చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని, తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. వంగూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయితీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో ఎర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి డీఆర్‌డీవో హాజరై మాట్లాడుతూ  నర్సరీలను ఎప్పటికప్పుడు పంచాయితీ కార్యదర్శులు పరిశీలించి తగు సూచనలు చేయాలన్నారు.  ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో జయసుధ, సర్పంచులు నరేశ్‌నాయక్‌, రాజునాయక్‌, మల్లీశ్వరి, ఈసీ రవినాయక్‌, ఉపాధి టెక్నికల్‌ అసిస్టెంట్లు సంపత్‌కుమార్‌, వాసుదేవ్‌, యాదయ్య, అల్లాజీ, పంచాయతీ కార్యదర్శి రవిశంకర్‌ , వంగూరు ఎంపీపీ భీమమ్మలాలూయాదవ్‌,ఎంపీడీవో జయరావ్‌, ఎంపీవో లక్ష్మణ్‌ ,ఏపీవో ఇమామ్‌ఆలీతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది  పాల్గొన్నారు.


logo