బుధవారం 27 మే 2020
Nagarkurnool - Mar 08, 2020 , 01:20:04

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : జిల్లా కేంద్రంలోని  సాధన డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 20వ వార్డు కౌన్సిలర్‌ పద్మమ్మ మహిళా అధ్యాపకులను సన్మానించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ   మేరి క్యూరీ, మదర్‌థెరిస్సా, కల్పనా చావ్లా, ఝాన్సీరాణి తదితరులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను  ఖండించాలన్నారు.  కార్యక్రమంలో యాజమాన్య సభ్యులు ప్రేమ్‌కుమార్‌, సుమిత్ర, రమేశ్‌, అరుణ్‌కుమార్‌, సుధాకర్‌, శ్రీలత, దీపిక, లింగమయ్య, రాఘవులు పాల్గొన్నారు.

బహుమతుల ప్రదానం

కందనూలు : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిప్రియ అన్నారు.  మండలంలోని గగ్గలపల్లిలోని   పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.  సమాజంలో లింగ భేదం లేకుండా ఉన్నప్పుడే దేశం అభివృధ్ధి చెందుతుందన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను  శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.  పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల   హెచ్‌ఎం కుర్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.    విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. మహిళా ఉపాధ్యాయులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం  చేసే మహిళలను  సన్మానించారు.  ఉపాధ్యాయులు శ్రీలత, భారతి, అరుణ, లలిత, అనిత, పద్మ  పాల్గొన్నారు.

తిమ్మాజిపేట మండలంలో..

తిమ్మాజిపేట :  మండలంలోని మారేపల్లి ప్రాథమిక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులకు,పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్‌పర్సన్‌ నాగమణిలను   సన్మానించారు.  కార్యక్రమంలో హెచ్‌ఎం రమేశ్‌  ఉపాధ్యాయునిలు యాదమ్మ, పూర్ణ,ప్రమీల, ఫాతిమా పాల్గొన్నారు.


logo