గురువారం 28 మే 2020
Nagarkurnool - Mar 07, 2020 , 00:28:01

అవగాహనతోనే క్షయ నిర్మూలన

అవగాహనతోనే క్షయ నిర్మూలన

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: ప్రస్తుతం క్షయవ్యాధి నిర్మూలను ప్రారంభ దశలోనే గుర్తించి ట్రూ  ల్యాబ్‌ ద్వారా పరీక్షలు జరిపి కేవలం గంట వ్యవధిలోనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు వెల్లడించడం జరుగుతుందని, తద్వారా జిల్లాలో ఎందరో పేదలకు మేలు చేకూరుతుందని  కలెక్టర్‌ శ్రీధర్‌ అన్నారు. శుక్రవారం జిల్లా దవాఖానలోని క్షయవ్యాధి నివారణ కేంద్రంలో నూతనంగా 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ట్రూనాట్‌ ల్యాబ్‌ను వారు ప్రారంభించారు. ఈ  కలెక్టర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ జిల్లాలో వ్యాధిలో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు  దీనిని నిర్మూలించేందుకు త్వరగా గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.  జిల్లా దవాఖానకు చేరుకున్న బ్లడ్‌ బ్యాంక్‌ పరికరాలను కలెక్టర్‌ పరిశీలించారు. బ్లడ్‌ బ్యాంక్‌ పరికరాలు 1 కోటి 20 లక్షల రూపాయలతో ఏర్పాట్లు కానున్నాయని, వీటిని త్వరలోనే ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో సాయినాథ్‌రెడ్డి, దవాఖాన సూపరిం  డాక్టర్‌ ప్రభు, టీవీ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌, చంద్రశేఖర్‌రెడ్డి, సాగర్‌, ఇతర డాక్టర్లు పాల్గొన్నారు.logo