మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Mar 07, 2020 , 00:27:09

సెంట్రల్‌ జీఎస్‌టీపై అవగాహన అవసరం

సెంట్రల్‌ జీఎస్‌టీపై అవగాహన అవసరం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: ప్రతి వ్యాపారి సీజీఎస్‌జీ అకౌంట్‌ ను కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు జీఎస్‌టీ చెల్లింపులు చేయాలని కేంద్ర జీఎస్‌టీ చీఫ్‌ కమిషనర్‌ మల్లికా ఆర్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన ‘జిల్లాలోని సెంట్రల్‌ జీఎస్‌టీ మీ వద్దకు’ అనే అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యాపారులకు సీజీఎస్‌టీపై అవగాహన  నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ  ఆమె మాట్లాడుతూ కాంట్రాక్టర్లు వ్యాపారులు సీజీఎస్‌టీ ఖాతాలను ప్రారంభించాలని, కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు జీఎస్‌టీ పన్నులు చెల్లింపులు చేయాలన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి వ్యాపారికి సీజీఎస్‌టీపై అవగాహన కల్పించాలని సూచించినట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1010 మంది కేంద్ర ప్రభుత్వం టాక్స్‌ పేయర్స్‌గా పేర్లు నమోదు చేసుకున్నారని, 1510 రాష్ట్ర ప్రభుత్వం ట్రాక్స్‌ ప్లేయర్స్‌గా నమోదు అయ్యారని పేర్కొన్నారు. ప్రతి  25వ తేదీ లోపు జీఎస్‌టీ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని, లేదంటే ఆదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటు  సూచించారు.  మాసం నుంచి పన్ను చెల్లింపులో మార్పులు ఉంటాయని, ప్రతి ఒక్కరూ కొత్త సీజీఎస్‌టీ రిటర్న్‌ ఫైల్‌ చేయాలని సూచించారు.   సమావేశంలో కమిషన్‌ కేసీ  అడిషనల్‌ కమిషనర్‌ బాలకృష్ణం  జిల్లా జీఎస్‌టీ రేంజ్‌ సూపరింటెండెంట్‌ లక్పతి, శ్రీధరన్‌, శేషగిరిరావు, జిల్లాలోని వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు హాజరయ్యారు.


logo