బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Mar 02, 2020 , 23:58:26

ఉన్నత లక్ష్యంతో చదవాలి

ఉన్నత లక్ష్యంతో చదవాలి

ఉన్నత లక్ష్యంతో చదవాలి


ఉప్పునుంతల : విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని ప్రభుత్వ విప్‌,  ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పెనిమిళ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిపండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుందన్నారు.  ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందన్నారు.  సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం మరవలేనిదన్నారు.  పాఠశాల అభివృద్ధికి గ్రామదాతలు ముందుకు రావడం పట్ల వారిని అభినందించారు.  ముందుగా  విద్యార్థులు ప్రభుత్వ విప్‌కు ఘనస్వాగతం పలికారు. దాతల సహాకారంతో రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసుకున్న రెండు తరగతుల గదులు, గ్లోబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, సైన్స్‌ ల్యాబ్‌లను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలలు నాటారు. పెనిమిళ్ల పాఠశాల అన్ని పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలన్నారు.కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌ వెంకటయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ భూపాల్‌రావ్‌, ఎంపీటీసీ సంబు భాస్కర్‌, ఎంఈవో బాల్‌జంగయ్య, మాజీ సర్పంచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి, మారం భైపాల్‌రెడ్డి ట్రస్ట్‌ చైర్మన్‌, సురేశ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సుల్తాన్‌, పాఠశాల హెచ్‌ఎం రమేశ్‌,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

  పాఠశాలలో మౌలిక వసతులు భేష్‌

         ఉప్పునుంతల : మండలంలోని పెనిమిళ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కావల్సిన మౌలిక వసతుల ఏర్పాట్ల పట్ల జిల్లా అదనపు కలెక్టర్‌ మను చౌదరి సంతృప్తి వ్యక్తం చేశారు.  బడి పండుగ కార్యక్రమంలో భాగంగా ఆయన పాఠశాలను సందర్శించారు.  10 తరగతి పరీక్షల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించాలని సర్పంచ్‌ వెంకటయ్యకు సూచించారు. మరో సారి పాఠశాలను సందర్శిస్తానన్నారు.  


logo