ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Mar 02, 2020 , 23:55:42

వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ గాంధీనాయక్‌ హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో ‘నా పోలీస్‌-నా భద్రత’ అనే అంశంపై షీటీమ్‌ వెంకటయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ   వేధింపులకు పాల్పడిన ఆకతాయిలపై వెంటనే 100కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించాలన్నారు. ఈ సంద్భంగాఓ విద్యార్థితో 100కు ఫోన్‌ చేయించి పోలీసులు పనితీరు గుర్తించి డెమో చేయించారు. షీ టీమ్‌ ఇన్‌చార్జి వెంకటయ్య మాట్లాడుతూ  చదువుకునే దశలో చెడు వ్యసనాలకు అలవాటుపడొద్దన్నారు. చిన్న విషయాలకు తల్లిదండులు, కళాశాలలకు చెడ్డపేరు వస్తుందన్నారు. తెలిసీ, తెలియని వయస్సులో ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అలాంటి వేధింపులకు పాల్పడితే  షీటీమ్‌కు సమాచారం అందించాలన్నారు.  ఐటీ కోర్‌ విక్రమ్‌ మాట్లాడుతూ సైబర్‌ క్రైమ్‌పై  విద్యార్థులకు అవాగాహన కల్పించారు. విద్యార్థులు వాడుతున్న ఫేస్‌బుక్‌ ద్వారా కలిగే నష్టాలను వివరించారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌ ద్వారా పరిచయాలు ఏర్పర్చుకొని చదువులకు దూమవుతున్నారన్నారు.  కార్యక్రమంలో పోలీస్‌ కళాబృందం సభ్యులు పాండు, షీటీమ్‌ సభ్యులు శ్రీనివాసులు, నీలిమ, రవి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.logo