శనివారం 30 మే 2020
Nagarkurnool - Mar 02, 2020 , 23:54:23

అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

అమ్రాబాద్‌: అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర అటవీశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి ఏకే సిన్హా అన్నారు. సోమవారం అమ్రాబాద్‌ మండలం ఫీల్డ్‌ కార్యాలయాన్ని సందర్శించి అమ్రాబాద్‌ టైగర్‌రిజర్వు ఫారెస్ట్‌లో చేపడుతున్న పనులను, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అటవీక్షేత్ర కార్యాలయంలో సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రెస్ట్‌ రూమ్‌ల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం కోర్‌జోన్‌లో సాసర్‌ ప్లేట్స్‌, మట్టిరోడ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌లో అమ్రాబాద్‌, మన్ననూర్‌, మద్దిమడుగు, దోమలపెంట రేంజ్‌లలో అటవీ అభివృద్ధికి రూ.9కోట్ల 79లక్షల 2019-20 వార్షిక ప్రణాళికలో సాసర్‌ప్లేట్లు, స్ట్రెంచింగ్‌, మట్టిరోడ్లు, దిమ్మెలు తదితర నిర్మాణాలతోపాటు అడవి నుంచి జంతువులు పంట పొలాల్లోకి రాకుండా ప్రత్యేక గోతులను తీస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్చిచ్చు రేగకుండా ప్రత్యేకంగా 24 గంటలు అందుబాటులో ఉండే రెస్క్యూ టీంలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి జోజి, ఎఫ్‌డీవో సుధాకర్‌రావు, ఎఫ్‌ఆర్‌వో ప్రభాకర్‌, రేంజ్‌ అధికారులు మురళీ, స్వప్న, మురళీధర్‌, ఎఫ్‌డీవో నాగేష్‌ సిబ్బంది పాల్గొన్నారు.logo