శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Mar 02, 2020 , 00:25:03

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే ఆశించిన అభివృద్ధి సా ధ్యమవుతుందని వ్యవసాయశాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్ర తి ఒక్కరూ మన ఇల్లు అని ఎలా అనుకుంటారో..అదే విధంగా మన వీధి, మ న ఊరు, మన పట్టణం అన్న భావన క లిగి ఉండాలని మంత్రి పిలుపునిచ్చా రు. ఆదివారం కల్వకుర్తి మున్సిపాలిటీలోని 11,22వ వార్డులలో నిర్వహించి న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్ర భుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరా జు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, మున్సిప ల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, జెడ్పీ వైస్‌ చై ర్మన్‌ బాలాజీసింగ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నా యకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. పట్టణ ప్రగతి కా ర్యక్రమానికి వచ్చిన మంత్రి నిరంజన్‌రెడ్డికి మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, ఎ మ్మెల్యే జైపాల్‌యాదవ్‌ స్వాగతం పలికారు. వార్డు కౌన్సిలర్లు మంత్రిని సన్మానించారు. 11వ వార్డులో జేసీబీకి పూ జలు నిర్వహించి పారిశుధ్య పనులను మంత్రి ప్రారంభించారు. జేసీబీతో చె త్తను ట్రాక్టర్లలో నింపారు. అక్కడి నుం చి 22 వార్డులో పట్టణ ప్రగతిలో మం త్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. 22 వా ర్డులో ఖాళీ ప్లాట్‌లో ప్లాట్‌ యజమాని కంటే ఏర్పాటు చేసుకోవడం పట్ల మం త్రి సంతోషం వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతిలో మున్సిపల్‌ చైర్మన్‌ సత్యం, ఎ మ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పనితీరుపై మం త్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ..ఇల్లుతో పా టు పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంద ని చెప్పారు. ఖాళీ ప్లాట్లను శుభ్రం చేసుకుని కంచే వేసుకుంటే అన్ని రకాలుగా మంచిగా ఉంటుందని అన్నారు. ఇతరు లు చెత్త లోపలికి వేయరు..పందులు కు క్కలు రావు, ఆ మూల, ఈ మూల క బ్జాలకు ఆస్కారం ఉండదని మంత్రి వి వరించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఖచ్చితంగా పల్లెలు, పట్టణాల స్వరూపా న్ని మారుస్తుందని పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో ప్రణాళికలు ఓ వైపు పరిశుభ్ర త కార్యక్రమాలు చేపడుతూనే మరో వై పు పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు ఏ ర్పాటు చేసుకోవాలని, ఖచ్చితంగా మొ క్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వై స్‌ చైర్మన్‌ షాహెద్‌, మున్సిపల్‌ కమిషన ర్‌ జాకీర్‌ అహ్మద్‌, వార్డు కౌన్సిలర్లు బో జిరెడ్డి, చైతన్యారెడ్డి, సాజన్యారెడ్డి, సూ ర్యప్రకాశ్‌రావు, నూనే యాదమ్మ, మం జుల, విండో అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌ ,శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు విజయ్‌గౌడ్‌, నాగేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొనగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుం డా డీఎస్పీ గిరిబాబు ఆధ్వర్యంలో సీఐ సైదులు, ఎస్సైలు మహేందర్‌, న ర్సింహ్మ బందోబస్తు ఏర్పాటు చేశారు.


logo