ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Mar 02, 2020 , 00:21:51

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న వట్టెం వెంకన్నఆలయం

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న వట్టెం వెంకన్నఆలయం

బిజినేపల్లి : మండలంలోని వట్టెం గ్రామం అడ్డగట్టుపై వెలిసిన వేంకటేశ్వరస్వామి ఆపద మొక్కులవాడిగా విరాజిల్లుతున్నాడు. ఇక్కడి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న ఆపదలు తొలగి సులువగా పనులు జరుగుతాయని భక్తుల నమ్మకం. పచ్చటి ప్రకృతి, బండలు, గుట్టల మధ్యన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం నెలకొన్నది. ఈ ఆలయాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సందడి రంగారెడ్డి 34 ఏండ్లుగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రధానంగా ఈ వెంకన్న ఆలయంతోపాటు హనుమంతుడి ఆలయం, అద్దాల మండపం, ఆంజనేయ, భారీ గరుడ విగ్రహాలు, కల్యాణ మండపం, గోశాల, నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రతి ఏటా ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడంతోపాటు శ్రావణమాసంతోపాటు ప్రతినెలా కల్యాణోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ బ్రహ్మోత్సవాల కోసం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సందడి రంగారెడ్డి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. 


7నుంచి 12వ తేదీ వరకు వెంకన్న బ్రహ్మోత్సవాలు

7వ తేదీన ఉదయం వేళలో నిత్యపూజలు, సాయంత్రం పుణ్యహావాచనం, రక్షాబంధనం, అంకురార్పణ, ధ్వజాదివాసం, 8న సుప్రభాతాది ఆరాధన వాసం, ధ్వజారోహణం, బలిప్రధానం, సంతానార్తులకు గరుడ ప్రసాద వితరణ, సాయంత్రం భేరి తాండవం, దేవతాహ్వానం, పల్లకీసేవ, హారతి, బలిశాత్తుమొర్ర నిర్వహించన్నురు. అదేవిధంగా 9న ఆరాధనాలి, నీరాజానాస్తం, సేవాకాలం, తిరువంజనం, సాయంత్రం సాయమారాధన, హోమం, బలి, శాత్తుమొర్ర, 10న ఆరాధన, అర్చన, సేవాకాలం, హోమాలు, బలిశాత్తుమొర్ర, వెంకన్న కల్యాణోత్సవం, రాజభోగం, సాయంత్రం హోమం, బలిశాత్తుమొర్ర, గరుడోత్సవం, 11న ఆరాధన, అర్చన, సేవాకాలం, హోమాలు, బలిశాత్తుమొర్ర, రాజభోగం, సాయంత్రం సాయమారాధన, హోమం, బలిశాత్తుమొర్ర, 12న ఆరాధన, అర్చన, సేవాకాలం, మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, రాజభోగం, శాత్తుమొర్ర, సాయంత్రం దేవతోద్వాసనం, పుష్పయాగం, ఉత్సవాల సమాప్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 


logo