శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Mar 02, 2020 , 00:19:38

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌సేవాలాల్‌

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్‌సేవాలాల్‌

అచ్చంపేట, నమస్తే తెలంగాణ: గిరిజనుల ఆరాధ్యదైవమైన సంత్‌ సేవాలాల్‌ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిధులు విడుదల చేసి నిర్వర్తించడం గొప్ప పరిణామమని ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేటలోని గిరిజన భవనం వద్ద గిరిజన సేవాసంఘం, ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో సంత్‌ సేవాలాల్‌ 281వ జయంతి వేడుకలు నిర్వహించారు. మేరామ అమ్మవారు, సేవాలాల్‌ చిత్రపటాలతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. బంజార మహిళల నృత్యాలు, బావోజీలు, యువకులు, ఉద్యోగులు, నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి ఊరేగింపు చేపట్టారు. గిరిజన భవనం వద్ద సేవాలాల్‌కు బంజార సాంప్రదాయబద్దంగా మహాబోగ్‌ నిర్వహించారు.  పట్టణంలోని ప్రధానవీధుల గుండా ఊరేగింపు ఆకట్టుకుంది. మహిళలు నృత్యాలు చేస్తూ ఊరేగారు. ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా వాహనంలో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు.  అనంతరం జయంతి ఉత్సవాల కన్వీనర్‌ ఆర్డీవో పాండునాయక్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గువ్వల బాలరాజు మాట్లాడారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ది పర్చడం జరుగుతుందన్నారు. అచ్చంపేటలో సంత్‌సేవాలాల్‌, మేరామ అమ్మవారి ఆలయాల నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. గిరిజనులు తనకు బాల్‌రాజ్‌నాయక్‌గా నామకరణం చేశారని గుర్తు చేశారు. సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు గువ్వల బాలరాజును సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తులసిరాం, తాసిల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపీడీవోలు శంకర్‌నాయక్‌, చెన్నమ్మ, ఎస్‌ఐ ప్రదీప్‌, జయరాంగురుస్వామి, చందులాల్‌, తులసిరాం బావోజిలు, ఎంఈవో రామారావు, జిల్లా రైతు సమితి అధ్యక్షుడు పోకల మనోహర్‌, జెడ్పీటీసీలు మంత్రియా, రాంబాబు, సంఘం అధ్యక్షుడు గోపాల్‌నాయక్‌, జైపాల్‌నాయక్‌ ముఖ్యనాయకులు బిచ్యానాయక్‌, మంగ్యానాయక్‌, దేశ్యానాయక్‌, ధర్మానాయక్‌, శంకర్‌రాథోడ్‌, హన్మంతునాయక్‌, బాలునాయక్‌, బాషునాయక్‌, ఈశ్వర్‌లాల్‌, పర్వతాలు, వసూరాం, రాములు, వంశీ, సీతారం, జయరాం, మోతిరాం, డాక్టర్‌ తారాసింగ్‌, శ్రీరాం, శంకర్‌, భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు నర్సింహ్మగౌడ్‌, రాజేందర్‌, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


logo