ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Mar 02, 2020 , 00:19:37

కొనసాగుతున్న ‘పట్టణ ప్రగతి’ పనులు

 కొనసాగుతున్న ‘పట్టణ ప్రగతి’ పనులు

నాగర్‌కర్నూట్‌ టౌన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ పరిధిలోని పలు వీధులు బాగుపడుతున్నాయి. పదిరోజులపాటు నిర్వహించే పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం మున్సిపల్‌ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ పనులు గుర్తించడం, గుర్తించిన పనులను అభివృద్ధి పరచడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సందర్భంగా హౌజింగ్‌బోర్డు కాలనీలోని 6వ వార్డుల్లో మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌ ప్రత్యేకంగా పర్యటించారు.  కాలనీ వాసులు, మహిళలతో కాలనీల్లోని సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. కాలనీలను పరిశుభ్ర ంగా ఉంచుకునేందుకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించుకునేందుకు సదవకాశమన్నారు. వార్డుల్లో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఇంటి నుంచి వచ్చే వ్యర్థాలు, తడిపొడి చెత్తను మున్సిపల్‌ నుంచి వచ్చే బండిలోనే వేయాలని సూచించారు. ఏ వీధులో కూడా ఖాళీ స్థలాల్లో చెత్త , ముళ్ల పొదలు  కనిపించకుండా శుభ్రం చేసుకోవాలని కౌన్సిలర్లకుసూచించారు.ఆయావార్డుల్లో ఎంపిక చేసిన కమిటీల సలహాలతో అన్ని పనులు చేసుకొని స్వచ్ఛ మున్సిపల్‌గా మార్చుకునేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.   


logo