శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Mar 02, 2020 , 00:11:08

హక్కుల సాధనకు కృషి చేయాలి

హక్కుల సాధనకు కృషి చేయాలి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : దివ్యాంగులు హక్కుల సాధన కోసం కృషి చేయాలని సక్షమ్‌ సంస్థ రాష్ట్ర కార్యదర్శి నందనం కరుణాకర్‌ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సమదృష్టి క్షమత వికాస్‌ ఏవం అనుసందాన్‌ మండల్‌(సక్షమ్‌) నాగర్‌కర్నూల్‌ జిల్లా వారి ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సమగ్ర వికాసం కోసం సక్షమ్‌ సమస్త అఖిల భారత స్థాయిలో వందలాది సేవా కార్యక్రమాలతో దాదాపు 350 మంది జిల్లాలో ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నారన్నారు. దివ్యాంగుల్లో ఉన్నటువంటి ఆత్మన్యూనతను పోగొట్టి ఆత్మ విశ్వాసంతో తమ కాళ్లపై పాత్రను కూడా నిర్వహించేట్లు కృషి చేసేట్లు సక్షమ్‌ సంస్థ ప్రయత్నం చేస్తుందన్నారు. దివ్యాంగుల హక్కులు బాధ్యతలు ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయం నోడల్‌ ఆఫీసర్‌ కుర్మయ్య వివరించారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కార మార్గాలను నాగర్‌కర్నూల్‌ జిల్లాస్థాయిలో తమ దృష్టికి తీసుకొని వస్తే వారికి కావాల్సిన అన్ని రకాల వనరులను సమకూర్చేట్లు ప్రయత్నం చేస్తానని బిజినేపల్లి వైద్యాధికారి డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.  ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రావణ్‌కుమార్‌, ఉపాధ్యక్షులుగా రవికుమార్‌, డాక్టర్‌ చంద్రపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అస్కని సురేశ్‌, ప్రచార ప్రముఖ్‌గా మల్లేశ్‌, కోశాధికారిగా సందు యాదగిరి, సభ్యులుగా శేఖర్‌, బాల్‌నర్సింహ, లలిత, మల్లమ్మ, భాగ్యలక్ష్మి, నిర్మల తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్‌, బ్లైండ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రతన్‌నాయక్‌,  యువజాగృతి పౌండేషన్‌ బాధ్యులు మధుసూదన్‌రెడ్డి, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 123 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. 


logo