ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Mar 01, 2020 , 00:14:13

డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాష

డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాష

మహబూబ్‌ నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : డీసీసీబీ, డీసీఎంస్‌ ఎన్నికలు ముగిశాయి. హైదరాబాద్‌ నుంచి పార్టీ అధిష్ఠానం అందచేసిన సీల్డ్‌ కవర్‌ను ఎన్నికల పరిశీలకుడు, ఎంపీ బండ ప్రకాశ్‌ తీసుకొచ్చారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, డైరెక్టర్లు, పార్టీ నేతల సమక్షంలో సీల్డ్‌ కవర్‌లో ఉన్న పేర్లను ఎంపీ బండ ప్రకాశ్‌ వెల్లడించారు. డీసీసీబీ చైర్మన్‌గా చిట్యాల నిజాం పాష, డీసీఎంస్‌ చైర్మన్‌గా పట్ల ప్రభాకర్‌రెడ్డిని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. డీసీసీబీ వైస్‌ చైర్మన్‌గా కొరమోని వెంకటయ్య, డీసీఎంస్‌ వైస్‌ చైర్మన్‌గా పాత్లావ త్‌ హర్యానాయక్‌లను నిర్ణయించారు. పార్టీ నిర్ణయించిన మేరకు వీరంతా నామినేషన్లు దాఖలు చేశారు. సింగిల్‌ డిజిట్‌ నామినేషన్లు దాఖలు కావడంతో నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. గెలుపొందిన అభ్యర్థులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 


అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం

డీసీసీబీ చైర్మన్‌గా మైనారిటీ, డీసీఎంస్‌ చైర్మన్‌గా ఓసీ, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌గా బీసీ, డీసీఎంస్‌ వైస్‌ చైర్మన్‌గా ఎస్టీ సామాజికి వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ఎప్పుడు లేనట్లుగా అన్ని సామాజికి వర్గాల కు సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఈ సందర్భంగా మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపికైన అభ్యర్థులు స్పష్టం చేశారు. 


డీసీసీబీ వద్ద పండుగ వాతావరణం

ఉదయం 8 గంటల నుంచే డీసీసీబీ ఆవరణలో సందడి నెలకొంది. పార్టీ పరిశీలకుడు, ఎంపీ బండ ప్రకాశ్‌ సీల్డ్‌ కవర్‌తో కార్యాలయం ఆవరణకు చేరుకోగానే ఎవరికి అదృష్టం వరిస్తుందోనని అక్కడున్న వా రంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఉదయం 10 గంట ల లోపు అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థుల పేర్లు అక్కడున్న వారందరికీ తెలిశాయి. అదే సమయంలో అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. మిగతా వారెవరూ నామినేషన్లు వేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు స్వీట్లు తినిపించి మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపా రు. కార్యకర్తలు పటాకులు కాల్చి సందడి చేశారు. డీసీసీబీ వద్ద పండుగ వాతావరణం కనిపించింది.


అన్ని వర్గాలకు ప్రాధాన్యం

రాష్ట్రంలో ఏ ఎన్నికల్లోనైనా టీఆర్‌ఎస్‌ పార్టీయే విజయం సాధించడం ఆనవాయితీగా మారిందని ఎంపీ బండ ప్రకాశ్‌ అన్నారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ సీఎం కేసీఆర్‌ ముందుకు సా గుతున్నాడన్నారు. అన్ని జిల్లాల్లో ఏకగ్రీవంగా జిల్లా సహకార సంఘాలను ఎన్నుకున్న రైతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తమ ను చైర్మన్లుగా చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలకు రుణపడి ఉంటామని డీసీసీబీ, డీసీఎంస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ప్రకటించారు.


logo