శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 29, 2020 , 01:56:16

పల్లె ప్రగతిలో పారిశుధ్యానికి మొదటి ప్రాధాన్యం : కలెకర్ట్‌

పల్లె ప్రగతిలో పారిశుధ్యానికి మొదటి ప్రాధాన్యం : కలెకర్ట్‌

కొల్లాపూర్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో ముఖ్యంగా పారిశుధ్యం, హారితహారం పనులకు మొదటి ప్రాధాన్యతగా గుర్తించి ఆయా వార్డుల్లో చేపట్టినట్లు కలెక్టర్‌ శ్రీధర్‌ వెల్లడించారు. పట్టణ ప్రగతిలో శుక్రవారం పట్టణంలోని 17వార్డు (ఎస్టీ రిజర్వ్‌వార్డు)లో పలు వీధుల్లో కలెక్టర్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ మనూచౌదరి, డీఆర్‌ఎడీఏ పీడీ సుధాకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీచంద్రశేఖరాచారి, వైస్‌చైర్‌పర్సన్‌ మహి మూదాబేగంఖాదర్‌ఫాషా, కమిషనర్‌ వెంకటయ్య, వార్డు కౌన్సిలర్‌ కృష్ణమూర్తి, వార్డుల ప్రత్యేకాధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విలేకరులతో మా ట్లాడుతూ.. పట్టణాల్లో  పారిశుధ్యం, హారితహారం పనులు చేపడుతూ ఆ యా వార్డుల్లో ఏమేమి ఉన్నాయో వా టిని గుర్తించి జాబితాను సిద్ధం చేసుకోవాలన్నారు. 


నిర్దేశిత సమయంలోగా మొక్కలు అందించాలి 

పెంట్లవెల్లి: నిర్దేశిత సమయంలోగా హరితహార మొక్కలను సిద్ధం చేసి అందించాలని  కలెక్టర్‌ శ్రీధర్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని జటప్రోల్‌, గోప్లాపురం, శింగవరం గ్రామాల్లోని హరితహార మొక్కల నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  మాట్లాడుతూ.. వివిధ గ్రామాల్లో ఉన్న నర్సరీలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మొక్కల పెంపకంలో ఎరువులు, నీరు పోయడం వంటి అంశాల్లో సాంకేతిక పాటించి మెరుగైన మొక్కలను నర్సరీల నుంచి వీలైనంత వరకు త్వరగా గ్రామాలకు అందించాలన్నారు. అనంతరం   గోప్లాపురంలో శ్మశా న వాటిక, డంపింగ్‌లను పరిశీలించారు. కార్యక్రమం లో డీఆర్‌డీఏ పీడీ సుధాకర్‌, ఎంపీడీవో గంగమోహన్‌, జటప్రోల్‌, గోప్లాపురం సర్పంచ్‌లు ఎస్‌కే ఖా జా, శ్రీనివాస్‌రెడ్డి  ఉన్నారు.


logo