శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Feb 29, 2020 , 01:54:14

సమస్యల పరిష్కారానికే ‘పల్లెనిద్ర’

 సమస్యల పరిష్కారానికే ‘పల్లెనిద్ర’

కొల్లాపూర్‌, నమస్తేతెలంగాణ: పట్ట ణ ప్రగతిలో భాగంగా ఐదోరోజు శుక్రవారం పట్టణంలో  చేపడుతున్న పారిశుధ్యం పనులపై కలెక్టర్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ మనూచౌదరి వేర్వేరు వార్డుల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టా రు. ఉన్నతాధికారులు వార్డుల్లో తిరిగి ప్రజల నుంచి సమస్యలను అడిగితెలుసుకున్నారు.కలెక్టర్‌ శ్రీధర్‌ మధ్యాహ్నం 12:30గంటలకు పట్టణంలో 17వార్డు (ఎస్టీ రిజర్వ్‌)లో ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో డ్రైనేజీ దుస్థితిని పరిశీలించారు. సమాచారం అందుకున్న అడిషనల్‌ కలెక్టర్‌ మనూచౌదరితో పాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, కమిషనర్‌ ఇతర అధికారులందరూ 17వార్డుకు చేరుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో  ఉన్న మురికికాల్వలను పరిశీలించారు. దీనికి శాశ్వత పరిష్కారం చేసేందుకు చర్యలుతీసుకోవాలని కలెక్టర్‌ కమిషనర్‌ వెంకటయ్యను ఆదేశించారు. 17వార్డు కౌన్సిలర్‌ కృష్ణమూర్తితో వార్డు సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఎక్కడా కూడా ముళ్లపొదలు ఉండకుండా జేసీబీలు, ట్రాక్టర్లు, సి బ్బందిని పెంచి పారిశుధ్య పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ కమిషనర్‌ వెంకటయ్యను ఆదేశించారు. వార్డుల్లో ఎక్కడెక్కడ ఖాళీ ప్రదేశాలు ఉన్నా యో వా టిని గుర్తించి అందులో మొక్కలు నా  టేందుకు చర్యలుతీసుకోవాలని సూచించారు. పట్టణ అభివృద్ధికోసం విరివిగా పనులు చేపట్టి  మంచి పేరు తెచ్చుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రఘుప్రోలు విజయలక్ష్మీచంద్రశేఖరాచారికి కలెక్టర్‌ సూచించారు. 


అంతకుముందు పట్టణానికి చేరుకున్న అడిషనల్‌ కలెక్టర్‌ మనూచౌదరి మొదట వివిధ వార్డులలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గున్‌రెడ్డినరేందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ పెబ్బేటికృష్ణయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రఘుప్రోలు విజయలక్ష్మీచంద్రశేఖరాచారి, వైస్‌ చైర్‌పర్సన్‌ మహిమూ దాబేగంఖాదర్‌ఫాషా, కమిషనర్‌ వెంకటయ్య, కౌన్సిలర్లు షేక్‌ రహీంఫాషాతో కలిసి వీధిబాటపట్టారు. మొదట వెంకటేశ్వర థియోటర్‌ ప్రాం తంలో రోడ్లు దుస్థితి, డ్రైనేజీ సమస్యను అడిషనల్‌ కలెక్టర్‌ మనూచౌదరికి వివరించారు. అలాగే 9వార్డులో సీసీరోడ్ల పై పేరుకుపోయిన మట్టి, ఖాదర్‌భాషా దర్గాకు వెళ్లే రహదారి  శిథిలావస్థలో ఉండి పారుతున్న మురికికాల్వ దుస్థితిని మనూచౌదరికి కౌన్సిలర్‌ అబ్దుల్‌ నహీం చూపారు. కాలనీల్లో ముళ్లపోదలు, మురికికాల్వల్లో సీల్ట్‌ తొలగింపు పనులకోసం కార్మికులు, జేసీబీ, ట్రాక్టర్లను ఒక వార్డు తరువాత మరో వార్డుకు వినియోగించేటట్లు చూడాలని అడిషనల్‌ కలెక్టర్‌ మనూచౌదరి కమిషనర్‌ వెంకటయ్యకు సూచించారు. ఆరో వార్డులో ఉన్న పాతపోలీస్‌స్టేషన్‌ స్థలం వద్దకు చేరుకున్న అడిషనల్‌ కలెక్టర్‌కు ప్రభుత్వ స్థలం అక్రమణకు గురికాకుండగా పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని వార్డు కౌన్సిలర్‌ మేకల రమ్యకుమారినాగరాజు విజ్ఙప్తి చేశారు. బస్టాండ్‌ వద్ద ఆక్రమణలు తొలగింపు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ప్రదేశంలో ప్రధాన రహదారుల అంచు లు ఆక్రమణకు గురికావడంతో శుక్రవా రం తెల్లవారు జామునుంచే జేసీబీతో మున్సిపల్‌ అధికారులు తొలగించారు. 


logo