బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 29, 2020 , 01:50:50

కల్యాణం.. కమనీయం

కల్యాణం.. కమనీయం

అమ్రాబాద్‌ రూరల్‌ : నల్లమల ప్రాంతంలోని ఉమ్మడి అమ్రాబాద్‌ మండలం రాయలగండి చెన్నకేవస్వామి కల్యాణ వేడుకలను శుక్రవారం కనువిందుగా నిర్వహించారు. ఈ కల్యాణ వేడుకలకు ఆలయకమిటీ చైర్మన్‌ ఇమ్మడి నిరంజన్‌, ప్రధాన కార్యదర్శి పెర్ముల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆయన సతీమణి గువ్వల అమలతోపాటు ప్రజాప్రతినిధులను ఆలయ కమిటీ సభ్యులు, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు పెర్ముల చెన్నకేశవులు, పదర మండల అధికార ప్రతినిధి అనిల్‌ ఆలయ పూజారి పూర్ణకుంభం, వాయిద్యాలతో కల్యాణ మండపానికి ఘనంగా స్వాగతం పలికారు. చెన్నకేశవస్వామి కల్యాణ మహోత్సవం అనంతరం ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సాగునీటిని కృష్ణమ్మతో ఈ ప్రాంత భూములను తడుపేల చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నానని గుర్తుచేశారు. 


ఉమ్మడి అమ్రాబాద్‌ మండలాన్ని అన్ని విషయాలలో ఎక్కడ విస్మయం చెందకుండా అభివృద్ధి చేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ఆలయాలు, గోపురాల వద్ద రాజకీయాలు చేయరాదని, దేవుడు అందరికి చెందినవాడని.. నేను ఈ ప్రాంతానికి తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చినప్పటి నుంచి నేటి వరకు చాలాసార్లు చెన్నకేశవస్వామి కల్యాణ వేడుకల్లో పాల్గొనడం నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. నాకు రాజకీయంగా ఆ ప్రాంత ప్రజలు నిత్యం వెన్నంటి ఉంటున్నారని, చెన్నకేశవుడి దీవెనలు నిత్యం ఉండేలా దీవించాలని, ఈ ప్రాంతానికి తాగునీరు తెచ్చుటకు సర్వశక్తులు ప్రసాదించాలని కోరారు. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు నిత్యం సల్లంగా ఉండాలని, ఎలాంటి రోగాలు, ఇబ్బందులు రాకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు.  ఆలయాల్లో పూజరులు దళితులు ఉండటం చాలా అరుదని ఈ ఆలయంలో పూర్వంనుంచి దళిత పూజారులే ఉండటం దళితులకు ఎంతగానో గర్వకారమన్నారు. ఈ ఆయలం లోపల కల్యాణ వేడుకలు జరుపుటకు ఇబ్బందికరంగా ఉన్నదని పలుమ సార్లు ఆక్కడి నేతల నాదృష్టికి తీసుకరావడంతో ఆలయానికి మండపం నిర్మాణం చేయుటకు గతేడాది రూ. 50లక్షలు మంజూరు చేయించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అదే  మండపంలో కల్యాణ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషమన్నారు. 


మిగిలిన పనులు ఊర్తి చేయుటకు రాష్ట్ర దేవాదాయశాఖ వారి దృష్టికి తీసుకెళ్లి మరిన్ని నిధులు మంజూరుచేయిస్తానన్నారు. పదర మండలంలోని వంకేశ్వరం గ్రామానిక చెందిన ఓంకారేశ్వర భజన మండలి సభ్యులు భక్తిగీతాలను హార్మోనియం ద్వారా ఆలపించి భక్తులను ఎంతగానో అలరించారు. రెండు మండలాల నుంచి దళితులు కల్యాణం కోసం తలంబ్రాలను తీసుకొచ్చారు. ఈ  కల్యాణ కార్యక్రమంలో జ్యోతినాయక్‌ తండా సర్పంచ్‌ రాత్లావత్‌ రాంనాయక్‌, జిల్లా డీసీసీబీ సభ్యులు, జిల్లా రైతు సమన్వయ సమితీ చైర్మన్‌ పోకలమనోహార్‌, ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటయ్య, జడ్పీటీసీ రాంబాబునాయక్‌, ఎంపీపీ బీక్యానాయక్‌, తాసిల్దార్‌ కిషోర్‌, అచ్చంపేట నగర పంచాయతీ చైర్మన్‌ తులసీరాం, వైస్‌ఎంపీపీ వరుణ్‌, ఎంపీటీసీ ఎల్లమ్మ, సునీత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటయ్య, రవీందర్‌రెడ్డి, నాయకులు బంగారు నర్సింహ, అనిల్‌కుమార్‌, ఆనంద్‌, ముత్యాలు, నర్సయ్య, యాదవ్‌, బాషునాయక్‌,  సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.  


logo