ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Feb 27, 2020 , 23:23:59

వైభవంగా మంత్రాలమ్మ సిడె

వైభవంగా  మంత్రాలమ్మ సిడె

కోడేరు: మండల పరిధిలోని జనుంపల్లి గ్రామ శివారులో వెలసిన మంత్రాలమ్మ ఆలయంలో గురువారం సాయంత్రం సిడె కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ  ఉత్సవానికి  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పాన్‌గల్‌ సింగిల్‌విండో చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్దన్‌రెడ్డిలు హాజరై పూజా  పాల్గొన్నారు.  ఈ  తిలకించేందుకు జిల్లాలోని నలు మూలల  భక్తులు అధిక సంఖ్యలో  వచ్చారు.  జాతర ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు నిర్వహించే  సిడె కార్యక్రమానికి ముందుగా ఆలయంలో కొలువు దీరిన మంత్రాలమ్మ అమ్మవారికి ఆలయ పూజారి మద్దిలేటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారి ఒంటి నిండా పసుపు( బండారు) తో అమ్మవారి ఆలయం నుంచి పూనకంతో బయటికి వచ్చాడు. అప్పటికే ఆలయం ఆవరణలో సిద్ధం చేసిన రథం బండి సిడెకు మద్దిలేటిని 30 అడుగుల కర్రకు కట్టారు. సుమారు 35 అడుగుల ఎత్తులో కర్రకు చివరన పూజారిని కట్టి ఆలయం చు  తిప్పారు. అనంతరం మంత్రాలమ్మకు వండిన నైవేద్యం మొక్కులు తదితర వాటిని భారీగా తీసుకెళ్లి భక్తులు సమర్పించుకున్నారు. గొర్రె పొట్టేళ్లు బొట్టు బోనంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మ వారికి సమర్పించి తాము కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. సిడె కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోడేరు ఎస్‌ఐ పోచయ్య గట్టి బందో బస్తు నిర్వహించారు.     సర్పంచ్‌ కాళ్ల కవిత, ఎంపీటీసీ శాలమ్మ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 


logo