శనివారం 30 మే 2020
Nagarkurnool - Feb 27, 2020 , 23:21:58

నాటిన మొక్కలపై నిర్లక్ష్యం చేసిన... ఐదుగురు సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు

నాటిన మొక్కలపై నిర్లక్ష్యం చేసిన... ఐదుగురు సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: హరితహారం కింద నాటిన మొక్కలు బతికించడంలో నిర్లక్ష్యం వహించిన సర్పంచ్‌లకు కలెక్టర్‌ శ్రీధర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో హరితహారంపై నిర్వహించిన సమీక్షా సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కింద నాటిన మొక్కలు తప్పనిసరీగా కనీసం 85 శాతం బతికించాలని చట్టంలో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని, అయితే కొన్ని గ్రామ పంచాయతీల్లో కనీసం 50 శాతం మొక్కలు కూడా బతకలేదని తెలియజేసస్తూ  కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్మూర్‌ మండలం కొండారెడ్డిపల్లిలో 25 శాతం, తెలకపల్లి మండలం అనంతసాగర్‌లో 25 శాతం, పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్‌లో 27 శాతం, నక్కలపల్లిలో 42 శాతం, లింగాల మండలం రాయవరంలో 46 శాతం మొక్కలు మాత్రమే బతకడం పట్ల కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పై గ్రామాల సర్పంచులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక చట్టప్రకారం వీరితోపాటు పంచాయతీ కార్యదర్శులకు శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అంతేకాక మరో 42 గ్రామ పంచాయతీల్లో హరితహారం మొక్కలు బతికిన శాతం తక్కువగా ఉన్నందున ఆ గ్రామాల సర్పంచులకు హెచ్చరికలతో కూడి మెమోలను జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు మనూ చౌదరి, హనుమంత్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్‌, డీఆర్‌డీవో సుధాకర్‌, డీఈవో గోవిందరాజులు, జిల్లాలోని ఆర్డీవోలు, పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్లు, ఏపీడీలు తదితరులు పాల్గొన్నారు.logo